వాట్సాప్ యాప్ ను ఉపయోగించే వాళ్లలో చాలామంది గ్రూపులుగా ఉంటారు. కొందరు ఆఫీస్ పనుల కొరకు, మరి కొందరు బంధువులు, స్నేహితుల కొరకు వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు. గ్రూప్ లో ఏదైనా చాట్ చేసినా, మెసేజ్ లు, వీడియోలు పంపినా ఇతరులకు ఆ సమాచారం తెలియదని మనం భావిస్తాం. అయితే వాట్సాప్ గ్రూపులలో మనకు తెలియకుండానే అపరిచితులు చేరే అవకాశం ఉంటుందని ఫలితంగా అపరిచితులకు సైతం గ్రూప్ కు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాధారణంగా వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా చేరాలని అనుకుంటే ఫోన్ నంబర్ ను గ్రూప్ అడ్మిన్ యాడ్ చేయడం లేదా లింక్ ద్వారా గ్రూప్ లోకి యాడ్ కావడం జరుగుతుంది. కొంతమంది వాట్సాప్ గ్రూప్ లింక్ లను ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఉంచుతున్నారు. ఫలితంగా పలు సందర్భాల్లో గూగుల్ సెర్చ్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ లు కనిపిస్తున్నాయి. గతంలో 4,70,000 వాట్సాప్ గ్రూపులకు సంబంధించిన వివరాలు గూగుల్ లో కనిపిస్తున్నట్టు జేన్ వంగ్ అనే ఒక ఇంజనీర్ ప్రూవ్ చేశారు.
అయితే ఆ తరువాత వాట్సాప్ గూగుల్ నుంచి ఆ లింక్ లను తొలగించింది. గతంలో గ్రూపు పేర్లు మాత్రమే గూగుల్ సెర్చ్ లో కనిపించగా కొన్నిసార్లు ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ పిక్చర్లు కూడా కనిపిస్తూ ఉండటంతో వాట్సాప్ యూజర్లు కంగారు పడుతున్నారు. గూగుల్ సెర్చ్‌లో ప్రైవేట్ చాట్ ఆధారంగా వాట్సాప్ గ్రూపులలోకి సులభంగా యాక్సెస్ కావచ్చని తెలుస్తోంది. ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా ఆన్ లైన్ నుంచి యూజర్లు ఎంటర్ కావడానికి వాట్సాప్ గ్రూపులు ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు.
వెబ్ నుంచి వాట్సప్ గ్రూపులలోకి చేరవచ్చని ఇంగ్లీష్ పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ చెబుతుండటం గమనార్హం. ఎవరైనా కొత్త వ్యక్తి వాట్సాప్ గ్రూపులలోకి ఎంటర్ అయ్యి వివరాలను తెలుసుకుని వాట్సాప్ గ్రూప్ నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి. గతంలో వాట్సాప్ ఈ సమస్యను ఫిక్స్ చేసినా సమస్య మళ్లీ పునరావృతం అవుతుండటం గమనార్హం.
జూన్ నెల చివరి వారంలో బ్యాంకు సేవలను వినియోగించాలనుకునే ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం వెలువడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా…
తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్…
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగిస్తున్న కార్యాలయాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర పరిపాలన నిర్వహణలో…
ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారిన చిత్రాల్లో “మా ఇంటి బంగారం” ఒకటి. ప్రముఖ నటి సమంత ప్రధాన…
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…