వాట్సాప్ యాప్ ను ఉపయోగించే వాళ్లలో చాలామంది గ్రూపులుగా ఉంటారు. కొందరు ఆఫీస్ పనుల కొరకు, మరి కొందరు బంధువులు, స్నేహితుల కొరకు వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు. గ్రూప్ లో ఏదైనా చాట్ చేసినా, మెసేజ్ లు, వీడియోలు పంపినా ఇతరులకు ఆ సమాచారం తెలియదని మనం భావిస్తాం. అయితే వాట్సాప్ గ్రూపులలో మనకు తెలియకుండానే అపరిచితులు చేరే అవకాశం ఉంటుందని ఫలితంగా అపరిచితులకు సైతం గ్రూప్ కు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.


సాధారణంగా వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా చేరాలని అనుకుంటే ఫోన్ నంబర్ ను గ్రూప్ అడ్మిన్ యాడ్ చేయడం లేదా లింక్ ద్వారా గ్రూప్ లోకి యాడ్ కావడం జరుగుతుంది. కొంతమంది వాట్సాప్ గ్రూప్ లింక్ లను ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఉంచుతున్నారు. ఫలితంగా పలు సందర్భాల్లో గూగుల్ సెర్చ్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ లు కనిపిస్తున్నాయి. గతంలో 4,70,000 వాట్సాప్ గ్రూపులకు సంబంధించిన వివరాలు గూగుల్ లో కనిపిస్తున్నట్టు జేన్ వంగ్ అనే ఒక ఇంజనీర్ ప్రూవ్ చేశారు.

అయితే ఆ తరువాత వాట్సాప్ గూగుల్ నుంచి ఆ లింక్ లను తొలగించింది. గతంలో గ్రూపు పేర్లు మాత్రమే గూగుల్ సెర్చ్ లో కనిపించగా కొన్నిసార్లు ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ పిక్చర్లు కూడా కనిపిస్తూ ఉండటంతో వాట్సాప్ యూజర్లు కంగారు పడుతున్నారు. గూగుల్ సెర్చ్‏లో ప్రైవేట్ చాట్ ఆధారంగా వాట్సాప్ గ్రూపులలోకి సులభంగా యాక్సెస్ కావచ్చని తెలుస్తోంది. ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా ఆన్ లైన్ నుంచి యూజర్లు ఎంటర్ కావడానికి వాట్సాప్ గ్రూపులు ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు.

వెబ్ నుంచి వాట్సప్ గ్రూపులలోకి చేరవచ్చని ఇంగ్లీష్ పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ చెబుతుండటం గమనార్హం. ఎవరైనా కొత్త వ్యక్తి వాట్సాప్ గ్రూపులలోకి ఎంటర్ అయ్యి వివరాలను తెలుసుకుని వాట్సాప్ గ్రూప్ నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి. గతంలో వాట్సాప్ ఈ సమస్యను ఫిక్స్ చేసినా సమస్య మళ్లీ పునరావృతం అవుతుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here