Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించి రాజకీయాల పరంగా ఎంతో బిజీగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇటీవల రాజకీయ సభలలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ తాను రాజకీయాలలోకి రావడం ఒక డైరెక్టర్ కు ఇష్టం లేదంటూ వెల్లడించారు.
పవన్ రాజకీయాలలోకి రావడం ఎవరికి ఇష్టం లేదు ఈయన ఎవరి గురించి చెప్పారనే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తావించినది మరెవరి గురించో కాదు తన స్నేహితుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియజేశారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అని తెలిపారు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని ఈయన వెల్లడించారు.
ఇక నేను రాజకీయాలలోకి రావడం త్రివిక్రమ్ కి ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు. నేను సమాజం గురించి ఆలోచించి రాజకీయాలలోకి వచ్చాను కానీ త్రివిక్రమ్ మాత్రం నా గురించి ఆలోచిస్తూ ఉంటారని పవన్ తెలిపారు. ఇక నేను సంపాదించిన డబ్బులని రాజకీయాలలో పార్టీ కోసం ఖర్చు పెడుతూ ఉండగా ఆయన మాత్రం నాకు సినిమాలను తీస్తూ నా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండేలాగా చేస్తూ ఉంటారు.
నా గురించే ఆలోచిస్తాడు..
ఇలా త్రివిక్రమ్ నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు కానీ రాజకీయాలలోకి వచ్చేటప్పుడు మనకు పాలిటిక్స్ ఎందుకు అంటూ చాలా సార్లు చెప్పారు కానీ నేను వినకపోవడంతో ఆయన చెప్పడం కూడా మానుకున్నారని పవన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…