సాధారణంగా ఈ మధ్య కాలంలో ఉన్న హీరోలు ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. కాస్త అటో ఇటో రెండో సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అదేవిధంగా ఇండస్ట్రీలో చిన్న హీరోలు లేదా కొత్త హీరోలు కూడా సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలను చేస్తే అదొక గొప్ప విషయంగా భావిస్తాము. ఇక సంవత్సరానికి మూడు సినిమాలు విడుదలైతే నిజంగానే అతను హీరో అంటారు. కానీ ఓకే హీరో సంవత్సరానికి పది సినిమాలు చేస్తే ఆ హీరోను ఇంకా ఏమంటారో చెప్పండి? అవును ఈ హీరో ప్రస్తుతం 30 సినిమాలకు ఓకే చెప్పి సరికొత్త రికార్డును సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే? అతనే మన మలయాళ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న పృథ్వీ రాజ్…
మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు సాధించుకున్న పృధ్విరాజ్ ఏకంగా 30 సినిమాలలో నటించడానికి ఓకే చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాలలో ఈ హీరో చేయబోయే సినిమాల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మూడు సంవత్సరాలలో ముప్పై సినిమాలు అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున విడుదల చేయాలి. ఒకప్పుడు ఈ విధంగా పది సినిమాలను విడుదల చేస్తే ఆ విధంగా ఎలా చేస్తారో అనే సందేహం అందరికీ కలిగేది. ప్రస్తుతం అదే తరహాలోనే పృథ్విరాజ్ సినిమాలలో నటించే విడుదల చేయనున్నారు.
ప్రపంచంలో ఏ హీరో కూడా ఇంతవరకు ఒకేసారి అన్ని సినిమాలను కమిట్ కాలేదు. కానీ పృథ్వి రాజ్ ఏ హీరో చేయలేనన్ని సినిమాలను సంవత్సరానికి 10 సినిమాల లో నటిస్తుండటంతో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే ఇతను నటించే పలు సినిమాలు షూటింగ్ జరగగా, పలు సినిమాలు స్క్రిప్టును తయారు చేసే పనిలో ఉన్నాయి. మరికొన్ని సినిమాలకు టైటిల్ కూడా ఖరారు అయ్యాయి. కనుక హీరో పృద్వి నిజంగానే ముప్పై సినిమాలలో నటిస్తూ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఈ సంవత్సరంలో ఈ హీరో నటిస్తున్న సినిమాలలో దాదాపు అర డజను సినిమాలు విడుదలయి ప్రేక్షకులను అలరించనున్నాయని చెప్పవచ్చు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…