Anushka: సూపర్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి అనుష్క. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇటీవల బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.
ఇక అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నాళ్లల్లోనే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలోను లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే సైజ్ జీరో సినిమా కారణంగా ఈమె పూర్తిగా లావు కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి తిరిగి కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇక అనుష్క నటించిన పాత్రలలో వేశ్యపాత్ర కూడా ఒకటి.
అల్లు అర్జున్ మంచు మనోజ్ అనుష్క నటించిన వేదం సినిమాలో ఈమె వేశ్య పాత్రలో నటించారు. ఇలా అనుష్క ఇలాంటి పాత్రలో నటిస్తున్నారని విషయం తెలిసిన ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఈమెకు ఈ పాత్ర చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. మరి ఈమెకు వార్నింగ్ ఇచ్చిన ఆ హీరో ఎవరు అనే విషయానికొస్తే ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.
ప్రభాస్ అనుష్కకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి వీరిద్దరూ ఆన్ స్క్రీన్ పై ఎంతో చూడముచ్చటైన జంటగా ఉంటారు. దీంతో వీరిద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతేకాకుండా వీరిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు. అనుష్క వేదం సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తుందనే విషయం తెలిసి ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆమె వద్దకు వెళ్లి ఇలాంటి పాత్ర చేస్తే ఆ ప్రభావం నీ కెరియర్ పై పడుతుందని తెలిపారట.
ఉత్తమ నటిగా ఫిలింఫేర్..
ఇలాంటి పాత్రలో చేయొద్దని తనకు చెప్పిన అనుష్క మాత్రం వినకుండా ఈ సినిమాలో నటించారు. కట్ చేస్తే సరోజ పాత్ర ద్వారా అనుష్క మెప్పించడమే కాకుండా ఈ పాత్రలో నటించినందుకు అనుష్క ఉత్తమ నటిగా వేదం సినిమాకు సౌత్ ఫిలింఫేర్ అవార్డును అందుకోవటం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…