ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ కూడా వెంటాడుతోంది.కరోనా నుంచి కోలుకొని బయటపడిన వారిలో బ్లాక్ ఫంగస్ తీవ్రరూపం దాలుస్తోంది.బ్లాక్ ఫంగస్ కారణంగా ఎంతో మంది కంటిచూపును కోల్పోతున్నారు. మరి కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఉన్నఫలంగా కరోనా బాధితులలో బ్లాక్ ఫంగస్ ఏర్పడడానికి గల కారణాలు ఏమిటని పరిశోధకులు అధ్యయనాలు ప్రారంభించారు.
ఈ అధ్యయనంలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ వీపీ పాండే బ్లాక్ ఫంగస్ రోగులపై అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా 100% బాధితులు యాంటీబయాటిక్స్ తీసుకున్నట్లు అధ్యయనంలో తేలిందనే విషయాన్ని రాజీవ్ జయదేవన్ అనే వైద్యుడు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
కరోనా సోకిన సమయంలో కరోనా నుంచి విముక్తి పొందడం కోసం అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్లే కరోనా నుంచి కోలుకున్న తరువాత వారిలో బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని ప్రొఫెసర్ పాండే తెలిపారు. మధుమేహ సమస్యలతో బాధపడేవారిలో ఎక్కువ భాగం స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ కి దారితీస్తుందని తెలియజేశారు.
కరోనా మహమ్మారి బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, కార్బాపెనెమ్స్ వంటి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అధికస్థాయిలో పెరిగిందని, ఈ విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగడానికి గల కారణం యాంటీబయాటిక్స్ కారణమని జయదేవన్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…