సోషల్ మీడియాలో ప్రతిఒక్కరు ఒక్కోలా స్పందిస్తుంటారు. కొంత మంది పాజిటివ్ గా పోస్ట్ చేసినవాటికి కూడా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. మరికొంత మంది అయితే అదేపనిగా అవతలి వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. వారికి అదొక ఆనందంగా ఫీల్ అవుతుంటారు కానీ వారు చేసే కామెంట్స్ వలన అవతలివారు ఎంత బాధ పడతారో కనీసం ఆలోచన కూడా వారిలో కలగదు. వద్దని ఎన్ని సార్లు చెప్పినా వారి చెవికెక్కదు. అటువంటి సంఘటనే తాజాగా నటీ రేణదేశాయ్ కి కలిగింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో “బద్రి” సినిమా వచ్చింది. ఆ సినిమా వచ్చి నిన్నటికి 20 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణదేశాయ్ ఆచిత్రానికి సంబందించిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఆ సినిమా షూటింగ్ నాటి ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టు చూసిన వారందరూ మళ్ళీ “బద్రి” సినిమాని గుర్తు చేసుకోగా, ఒక నెటిజన్ మాత్రం “ఈ రేణు దేశాయ్ ఏంటో మళ్లీ గెలుకుతుంది అవసరమా ఇపుడు. ఆ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేసింది మళ్ళీ ఈ పోస్ట్ లు ఎందుకు… ఎంగేజ్మెంట్ అయ్యింది కదా ఆ విషయం ఎమ్ అయ్యింది..” అంటూ కామెంట్ పెట్టాడు.
అతని పోస్టుకు షాక్ తిన్న రేణు దేశాయ్ స్పందిస్తూ “బద్రి నా మొదటి సినీమా చాలా మంది మర్చిపోయి ఉంటారు, ఆ సినిమా నాకు చాలా చాలా స్పెషల్.. నా మొదటి సినిమా జ్ఞాపకాలు పంచుకుంటే తప్పేంటి ? అయిన నామీద ఎందుకు అంత ద్వేషం అన్నా..” అని ఆమె తన ఆవేదన వ్యక్త పరిచారు. ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. అయిన ఆవిడ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం అభిమానులకు ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత చాలా మంది పవన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడిన సందర్బాలూ ఉన్నాయి.. వాటి వలన ఆమె ఎంతో మానసిక క్షోభ అనుభవించారు. ఆడవారికి కూడా సమాన హక్కులు ఉన్న ఈ సమాజంలో మరొక పెళ్లి చేసుకుంటే తప్పేంటి. ఆధునిక సమాజంలో ఉండి కూడా మగవాడు చేసుకుంటే లేని తప్పు ఆడవారికి ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఎది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానుల వలన రేణు దేశాయి వేదింపులకు గురి అవుతుంది అనడం వాస్తవం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…