ప్రస్తుతం యావత్ భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం మన ముందున్న మార్గం వ్యాక్సిన్ మాత్రమే. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా కరోనా బారిన పడినప్పటికీ మన పై అధిక ప్రభావం చూపుదని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోని వ్యాక్సిన్ పై అధికారులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
అయితే ఈ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా వ్యాక్సింగ్ చేయించుకున్న 81 సంవత్సరాల విలియం షేక్స్‌పియర్ అనే వృద్దుడు మృత్యువాత పడ్డాడు. అయితే అతను కరోనా బారిన పడి మృతి చెందాడా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది.81 సంవత్సరాల విలియం షేక్ స్పియర్ గత ఏడాది డిసెంబర్ నెలలో వార్‌విక్‌షైర్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో కావెంటర్రీలో తొలి ప్ఫిజెర్ – బయోటెక్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ వేయించుకున్న విలియం గత గురువారం మృతిచెందినట్లు అతని సన్నిహితులు తెలియజేశారు. ఏ ఆసుపత్రిలో అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారో అదే ఆస్పత్రిలో విలియం మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే విలియం కరోనా బారినపడి మృతి చెందడం లేదని.. అతను గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ప్రపంచంలోని తొలిసారిగా పురుషులలో విలియం షేక్స్పియర్ కరోనా వ్యాక్సిన్ తీసుకోగా.. మహిళలలో మొట్ట మొదటి వాక్సిన్ మార్గరేట్ కీనన్ అనే 91 సంవత్సరాల మహిళ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ క్రమంలోనే తొలి వేయించుకున్న వారిగా విలియం, మార్గరేట్ కీనన్ గుర్తింపును పొందారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…