Crime News: బ్రేక్ వేసి కాపాడినందుకు డ్రైవర్ ను కొట్టిన మహిళ అరెస్ట్ …. వీడియో వైరల్!
Crime News: తప్పు ఎవరు చేసినా తప్పే.. దానిని ఒప్పుగా మార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తుంటారు. కానీ నిజం నిప్పులాంటిది.. తప్పు ఎప్పటికీ ఒప్పు కాలేదు అనే సామెతలు ఉన్నాయి కాదా.. అలానే తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడ జరిగిన ఘటనలో తప్పు తమదని తెలిసి కూడా.. ఎదుటి వ్యక్తిపై బనాయించేందుకు ప్రయత్నించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నడి రోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్ పై ఓ మహిళ దాడి చేసింది. ఏ మాత్రం మానవత్వం లేకుండా.. అతడి పొట్టపై కాలితో తన్నింది. తప్పు ఆమె చేసి.. పెద్ద గొంతేసుకొని డ్రైవర్ ను అనరాని మాటలు అంటూ.. సభ్యసమాజం తలదించుకునే విధంగా చేసింది.
తోటి ప్రయాణికులు అడ్డుకున్నా.. ఏ మాత్రం ఆలోచించలేదు. నీది తప్పు అమ్మా.. అని ఎవరైనా అంటే.. నీకు అవసరం లేదు అంటూ సమాధానం చెబుతూ.. కోపంతో ఊగిపోయింది.
ప్రస్తుతం బస్సు డ్రైవర్ పై ఆమె చేసిన దాడికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.
మహిళ రాంగ్ రూట్లో వెళ్లి.. బస్సు డ్రైవర్ దే తప్పు అన్నట్లు సీన్ క్రియేట్ చేయగా.. పోలీసులు మాత్రం ఆమెదే తప్పు అని నిర్ధారించారు. పోలీసులకు అతడు ఫిర్యాదు చేయడగా.. ఆమెను అరెస్టు చేశారు. 14 రోజులు రిమాండ్ విధించి కోర్టు. అన్యాయంగా డ్రైవర్ పై దాడి చేసిన ఆమెకు సరైన శిక్ష విధించారు అంటూ నెటిజన్లు పోలీసులను మెచ్చుకుంటున్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే దానిని మరో సారి రుజువైందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…