గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో కొడుకు చనిపోయిన ఎనిమిది నెలల తరువాత తల్లికి సూసైడ్ నోట్ లభించింది. ఆ సూసైడ్ నోట్ లో ఉన్న విషయాలను తెలుసుకుని షాకవ్వడం తల్లి వంతయింది. కోడలు వల్లే కొడుకు చనిపోయాడని తెలిసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మాధవ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవనం సాగించేవాడు.
వివాహం జరిగిన తర్వాత మాధవ్ కు కొన్ని శారీరక సమస్యలు తలెత్తాయి. దీంతో మాధవ భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కళ్ల ముందే భార్య అలా చేయడంతో తట్టుకోలేకపోయిన మాధవ్ 2019 సంవత్సరం ఏప్రిల్ నెలలో సూసైడ్ నోట్ రాసుకున్నాడు. అయితే చనిపోవాలని అనుకున్నప్పటికీ మాధవ్ కు చనిపోవడానికి ధైర్యం చాలలేదు. ఆ సూసైడ్ నోట్ ను మాధవ్ ఇంట్లో కప్ పోర్డ్ లో ఉంచాడు.
సూసైడ్ నోట్ రాసిన ఏడాది తరువాత 2020 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన మాధవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నిరోజుల క్రితం మాధవ్ తల్లి లీలా జాదవ్ ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో మాధవ్ కప్ బోర్డ్ ను పరిశీలించగా సూసైడ్ నోట్ లభ్యమైంది. మాధవ్ తన భార్యకు, ఆమె ప్రియునికి చాలాసార్లు చెప్పినా వినలేదని.. నిత్యం వాళ్లు తనను అవమానించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
విషయం తెలిసిన మాధవ్ తల్లి ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే పరోక్షంగా మాధవ్ ఆత్మహత్యకు కారణమైన మాధవ్ భార్యను, మాధవ్ భార్య ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తరువాత మాధవ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…