Categories: General News

Viral Video: భార్యను మేనళ్లుడికిచ్చి పెళ్లి చేసిన భర్త ! ఎం జరుగుతుంది భయ్యా దేశంలో..

బీహార్‌లోని జముయ్ జిల్లాలో ఒక విపరీతమైన ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురి జీవితాల్ని పూర్తిగా తలకిందులు చేసిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సిఖేరియా గ్రామానికి చెందిన ఆయుషి కుమారి అనే మహిళ తన మేనళ్లుడయిన అయిన సచిన్ దూబేతో ఓ ఆలయంలో పచ్చబొట్టేసుకుంది. ఆశ్చర్యకరంగా, ఈ వివాహం ఆమె భర్త మరియు చిన్న కుమార్తె ముందే జరిగింది.

Woman Marries Her Nephew In Front Of Her Husband & Daughter

ఆయుషి మొదట 2021లో విశాల్ దూబేతో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని నెలలుగా ఆయుషికి, తన భర్తకు బంధువైన సచిన్ దూబేతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయం పెరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి, చివరకు భార్యగా మారే వరకు తీసుకెళ్లింది. జూన్ 15న ఆయుషి ఆకస్మికంగా గల్లంతవ్వడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఆ తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆయుషి విడాకులకు కోర్టులో దరఖాస్తు చేయడంతో పాటు, తన కుమార్తెను కూడా వద్దనుకుంది. రెండు కుటుంబాల అంగీకారంతో, జూన్ 20న గ్రామంలోని ఆలయంలో ఆయుషి – సచిన్ వివాహం జరిగింది. వివాహం అనంతరం సచిన్ మాట్లాడుతూ, “ఇప్పుడైనా మా ప్రేమకు గుర్తింపు వచ్చింది. ఆయుషిని జీవితాంతం సంతోషంగా ఉంచుతాను” అని అన్నాడు. మరోవైపు, భర్త విశాల్ స్పందిస్తూ, “ఆమె సంతోషంగా ఉంటే చాలు, అడ్డుకోవాలనుకోవడం లేదు. కానీ నా మీద వేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలే. ఆమె నా తల్లి, కుమార్తెతో మంచిగా ఉండేది కాదు. ఇకమీదట ఆమె బాధ్యత సచిన్‌దే” అని స్పష్టం చేశారు.

ఇప్పుడు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమ పేరు చెప్పుకుంటూ కుటుంబాన్ని, బంధాలను తాకట్టు పెట్టే విధానంపై పలువురు విమర్శలు చేస్తుండగా, కొందరైతే వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతుగా అభిప్రాయపడుతున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago