ప్రేమించిన వాడు తనని మోసం చేసి, తనను దూరం పెట్టి మరొక అమ్మాయికి దగ్గర కావడంతో ఆ ప్రియురాలు ఓర్చుకోలేక పోయింది. ఈ క్రమంలోనే తన ప్రియుడు వేరే అమ్మాయితో చనువుగా ఉండటం చూసి ఓర్వలేని ఆ ప్రియురాలు ఎలాగైనా తన ప్రియుడికి బుద్ధి వచ్చేలా చేయాలని భావించి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.చివరికి ఆమె వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో చివరకు కటకటాల పాలైన ఘటన తూర్పు చైనాలోని షావోజింగ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
లావ్ అనే యువతి.. కియాన్ అనే యువకుడు ఇద్దరు ఒకరినొకరు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే కియాన్ గత కొద్ది రోజుల నుంచి లావ్ ను దూరం పెడుతూ వచ్చాడు. వీరిరువురి మధ్య దూరం పెరగడమే కాకుండా మరొక యువతికి దగ్గరయ్యాడు. ఇది చూసి ఓర్వలేని లావ్ ఎలాగైనా తనకు బుద్ధి చెప్పాలని భావించింది. ఈ క్రమంలోనే తన స్నేహితుడు సహాయం తీసుకొని ఎలాగైనా తన ప్రియుడికి బుద్ధి చెప్పాలని భావించింది.
ఈ క్రమంలోనే తన స్నేహితుడు జుహ్ ద్వారా లావ్ తన మాజీ ప్రియుడి ఆడి కారును అద్దెకు తీసుకుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కారు ప్రయాణం చేసింది.ఈ విధంగా 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డుపై చక్కెర్లు కొట్టడంతో పోలీసులు తన ప్రియుడికి జరిమానా విధిస్తారని భావించింది. కానీ తన ప్రియుడు నుంచి తన స్నేహితుడు జుహ్ పేరు మీదుగా కారును అద్దెకు తీసుకుంటున్నట్లు తెలియడంతో పోలీసులు తన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు జుహ్ ను విచారించగా అతడు అసలు విషయం బయట పెట్టాడు. కియాన్‌కు చెందిన కారును అద్దెకు తీసుకొచ్చి.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలని చెప్పిందని తెలిపాడు. ఇలా చేస్తే తనతో డేటింగ్ కి వస్తానని చెప్పడంతోనే తనకు సహాయం చేశాను అని తెలిపాడు. తన మాజీ ప్రియుడు నుంచి తనకు కారును అద్దెకు ఇప్పించాలని కోరిందని అసలు విషయం బయట పెట్టడంతో పోలీసులు లావ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…