సాధారణంగా ఒక పామును చూస్తేనే భయంతో గజగజ వణికి పోతాము. అలాంటిది ఏకంగా 18 పాములు ఇంట్లో.. అది పరుపుకింద కనిపిస్తే ఇక నిద్ర సంగతి దేవుడెరుగు ఆ ఇంట్లో ఉండాలన్న క్షణం క్షణం భయంగా అనిపిస్తుంది. అచ్చం ఇలాంటి భయాన్ని జార్జియాలోని అగస్టాలో ఓ జంట ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
జార్జియాలోని అగస్టాలో నివసించే ట్రిస్ విల్చర్ అనే మహిళ రాత్రి పడుకోవడానికి బెడ్ సర్దుతూ ఉండగా ఆమెకు నేలపై తాడులాగా ఒకటి కనిపించింది. అది ఏంటని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన ఆమెకు గుండె ఆగినంత పని అయింది. అది పాము అని గుర్తించి వెంటనే తన భర్తను కేకలు పెడుతూ పిలిచింది. దీంతో అక్కడికి చేరుకున్న తన భర్త మ్యాక్స్ వచ్చి చూడటంతో అదే సమయంలో మరొక పాము పిల్ల కనిపించడంతో మ్యాక్స్ ఇంట్లో చాలా పాములు ఉంటాయని భావించి పరుపును తిప్పి చూశారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 పాములు పరుపు కింద ఉండటంతో ఆ జంట హడలిపోయారు. ఈ క్రమంలోనే మ్యాక్స్ ఒక సంచి తీసుకొని ఆ పాములను పట్టి అందులో వేసి అటవీ ప్రాంతంలో వదిలి వచ్చాడు. ఈ విధంగా పరుపుకింద 18 పాములను చూసేసరికి ట్రిస్ భయంతో హడలి పోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని పాములు ఒకేసారి చూసేటప్పటికీ గుండె వేగం పెరిగిందని, ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గరకు వెళ్లాలని తెలిపారు.ఇంట్లో ఉండాలంటే భయంగా ఉందని ఈ సందర్భంగా ట్రిస్ తెలిపారు.
ఈ సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ టీం ఇంటిని మొత్తం జల్లెడపట్టి ఇంటిలో మరెక్కడా పాములు లేవని చెప్పినప్పటికీ ఆ జంట మాత్రం చాలా కంగారుగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం తన ఇంటి చుట్టూ శుభ్రం చేయటం వల్ల ఇంట్లోకి వచ్చి ఉంటుందని వారు భావించారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…