Categories: FeaturedGeneral News

ఒకే కాన్పులో పదిమంది పిల్లలు.. ఎక్కడంటే?

సాధారణంగా ఒక కాన్పులో ఒకరు పుట్టడం సర్వసాధారణం. అదే ఒకే కాన్పులో కవలలు ఉండి వారికి జన్మనివ్వాలంటే అది సాహసంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. కడుపులో ఇద్దరు పిల్లలు పెరుగుతుంటే తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.తరచూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఆహార విషయాలలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తుంటారు. కవలలకే ఇన్ని జాగ్రత్తలు పాటిస్తే మరి ఏకంగా ఓ మహిళ ఓకే ప్రసవంలో పది మంది పిల్లలను కని అందరిని ఆశ్చర్య పరిచింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ నెలకొల్పని రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

దక్షిణాఫ్రికాకు చెందిన 37 ఏళ్ల గోసియామ్ తమరా సిథోల్ అనే మహిళ మే 7వ తేదీ సోమవారం ఆమె ప్రిటోరియా హాస్పిటల్‌లో పది మంది పిల్లలకు జన్మనిచ్చింది.ప్రసవ సమయంలో ఆమె సాధారణ ప్రసవం అవ్వడానికి కష్టం కావడంతో డాక్టర్లు సిజేరియన్ ద్వారా పిల్లలను బయటకు తీసినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే ఏడుగురు మగ పిల్లలు ముగ్గురు ఆడ పిల్లలకు సదరు మహిళా జన్మనిచ్చింది.ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు.

ఇది వరకే సిథోల్ కి తొలి కాన్పులో కవలలు జన్మించగా రెండవ కాన్పులో ఏకంగా పది మంది జన్మించారు.ప్రసవానికి ముందు వైద్యులు నిర్వహించిన పరీక్షలో ఆమె గతంలో కేవలం ఆరుగురు మాత్రమే పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. కానీ ప్రసవం తర్వాత ఆమె 10 మంది పిల్లలకు జన్మనివ్వడంతో ఎంతో ఆశ్చర్యపోయారు.ఈ క్రమంలోనే సదరు మహిళ మాట్లాడుతూ ఒకేసారి పది మంది పిల్లలకు జన్మనివ్వడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని. గర్భం ధరించినప్పుడు తన కాళ్ళు విపరీతంగా నొప్పిని కలిగించేవని తెలిపారు. ఒకేసారి గర్భంలో అంతమంది ఉండటం వల్ల ప్రాణాలతో ఉండరేమోనని భావించామని తెలిపారు.

ఈ విధంగా ఈ మహిళ ఒకే ప్రసవంలో 10 మంది పిల్లలకు జన్మనివ్వడంతో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళగా రికార్డు సొంతం చేసుకున్నారు.ఇప్పటి వరకు అత్యధిక పిల్లలను ప్రసవించిన రికార్డు హలీమా సిస్సే పేరు ఉండగా తాజాగా ఈమె పదిమందికి జన్మనిచ్చి ప్రపంచంలోనే అరుదైన రికార్డును నెలకొల్పారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago