Categories: FeaturedMovie News

ప్రపంచంలోనే ఫస్ట్ పెయిడ్ ట్రైలర్ “పవర్ స్టార్” ! (వీడు సామాన్యుడు కాదు అంటున్న వర్మ ఫ్యాన్స్)

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి కథ దొరకడమే ఆలస్యం, వెంటనే సినిమా టైటిల్ ను ప్రకటించేస్తాడు. అప్పటికప్పుడు నటీనటులను సిద్ధం చేసేసి.. ఏకంగా ట్రైలర్ ను కూడా విడుదల చేసేస్తాడు. మాటలు చెప్పినంత ఈజీగానే సినిమా కూడా షార్ట్ పీరియడ్‌లో కంప్లీట్ చేసేసి.. అందర్నీ ఆశ్చర్య పరుస్తాడు. లేటెస్ట్ గా లాక్‌ డౌన్ టైమ్‌లో కూడా క్లైమాక్స్, నేక్డ్, మ ర్డర్ లాంటి సినిమాలు తీసి పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్‌ ను సైతం ఆశ్చర్యపరిచిన వర్మ.. ప్రస్తుతం “పవర్ స్టార్” పేరుతో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎవరి కథ అనేది బహిరంగ రహస్యమే. తన సొంత సినిమాల విడుదలకు ‘ఆర్జీవీ వరల్డ్‌’ ను స్థాపించుకుని సెన్సార్‌ షిప్ లేకుండా జాగ్రత పడిన వర్మ.. ప్రపంచంలో ఫస్ట్ పెయిడ్ ట్రైలర్‌ను విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.

“పవర్ స్టార్” ట్రైలర్ చూడాలంటే.. 25 రూపాయలు చెల్లించాలని వర్మ బలంగా చెబుతుండటం విశేషం. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ వివాదాలతోనే తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడంలోనూ, ప్రేక్షకులకున్న బలహీనతలను వాడుకోవడంలోనూ వర్మను మించిన మేధావి లేడన్నది టాలీవుడ్ సత్యం. “పవర్ స్టార్” చిత్రం విషయంలోనూ వర్మ మరోసారి తనదైన స్టైల్ ను చూపించారు. ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేటర్‌ లో జులై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న “ప‌వ‌ర్ స్టార్” చిత్రం కోసం ప్ర‌స్తావించారు. ప్ర‌పంచంలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ కోసం రూ. 25 క‌ట్టి చూడవచ్చన్నారు. ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే కనివినీ ఎరుగని విషయమని, దీని క్రెడిట్ అంతా ఆర్జీవీ వరల్డ్‌ కు మాత్రమే దక్కుతుందని, ఆల్ రెడీ “పవర్‌స్టార్” ట్రైలర్‌ కు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమైన‌ట్లు తెలియజేశారు. ఈ సినిమా జులై 25 శ‌నివారం ఉద‌యం 11గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపిన ఆర్జీవీ.. దానికంటే ముందు జులై 22న సినిమా ట్రైలర్‌ ను విడుద‌ల చేస్తున్నామ‌ని, మీకు చూడాలనిపిస్తే చూడండి.. లేదంటే మానేయండి.. కానీ “పవర్ స్టార్” ట్రైలర్ ను చూడాలంటే మాత్రం రూ.25 క‌ట్టే చూడాల‌ని సూచించారు.

సినిమా చూసేందుకు అదే రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవుతాయన్నారు. జులై 25న సినిమా విడుద‌ల చేస్తున్నామ‌ని రూ. 150తో పాటు GST క‌ట్టి టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చని, ఈ ఆఫ‌ర్ జులై 25 ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుందని, అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకపోతే.. సినిమా థియేటర్‌లో బ్లాక్ టికెట్లు కొన్న‌ట్లు కొనాల్సి వ‌స్తుందంటూ ఆర్జీవీ ఈ “ప‌వ‌ర్ స్టార్” సినిమా విడుద‌లకు సంబంధించిన ఒక ఆడియో టేప్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. గతంలో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు 100 రూపాయలు.. ఆ తర్వాత ‘నేక్డ్’ అనే మరో సినిమాకు 200 రూపాయలు టికెట్ పెట్టిన వర్మ 25 జూలై తర్వాత వస్తున్న “పవర్ స్టార్” రేటును రూ.250గా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంత కాన్ఫిడెన్స్ గా విడుదలవుతున్న వర్మ ‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్ లో ఇంతకీ ఏముందయ్యా.. అంటే.. తాజాగా ట్రైలర్ పోస్టర్‌లో చంద్రబాబు, పవన్‌ల మధ్య వైరాన్ని క్రియేట్ చేస్తూ పోస్టర్ ను వదిలారు.

ఇక ఈ చిత్రంలో PK, MS, NB, TS, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, RGVతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఇందులో ఉంటుందని తెలియజేశాడు. PK అంటే పవన్ కళ్యాణ్.. MS అంటే మెగాస్టార్, NB అంటే నాగబాబు, TS అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాదని చెప్తున్న వర్మ.. పేర్లతోనే కాకుండా వాళ్లని పోలిన పాత్రలతో కూడా ఈ చిత్రంలో కొన్ని ప్రయోగాలను చేశాడని తెలుస్తుంది. వాస్తవానికి ఇది రామ్ గోపాల్ వర్మ కల్పిత కథ అయినప్పటికీ తాజా పోస్టర్‌లో ‘పవర్ స్టార్’.. చంద్రబాబులాగ వున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు పో అని చేయి చూపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ తో వర్మ ‘ఎన్నికల తరువాత జరిగిన కథ’లో ఏం చెప్పబోతున్నారు.? నిజంగానే పవన్, బాబుల మధ్య ఇంత శత్రుత్వం వుందా.? లేదంటే ఇదంతా వర్మ మనసులోని కల్పిత భావమేనా.? అనే సందేహాలు అటు టాలీవుడ్ లోనూ.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

5 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

5 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

5 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

5 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

5 months ago