Writer Ramesh reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పని చేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికీ పరిచయం ఉండటం వల్ల అప్పటి నుండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. ఇక బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలతోనే కాకుండా రవితేజ, గోపీచంద్ వంటి హీరోలతో మంచి బాండ్ ఉన్న రమేష్ రెడ్డి గారు ఏవైనా మంచి కథలు దొరికితే రవి తేజ, గోపీచంద్ కి మొదట చెప్తారట. ఇక స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఇక ఇండస్ట్రీ లో జరిగే చిన్న చిన్న గొడవల గురించి అయన వివరించారు.
మొహాన్ బాబు, బ్రహ్మానందం గొడవ…
బ్రహ్మానందం, బాబుమోహన్, కోటా ఇలా కొందరు కెరీర్ లో పీక్స్ లో ఉండే సమయంలో ప్రతి సినిమాలోనూ వాళ్ళ కామెడీ ట్రాక్ ఉండేది. ఏక కాలంలో దాదాపు నలుగురు సినిమాలను వాళ్ళు చేసేవారు. అలాగే వాళ్లకు కామెడీ ట్రాక్ లను నేను గోపి మోహన్ రాసేవాళ్లం అంటూ రమేష్ రెడ్డి తెలిపారు. అలా జగపతి బాబు భలే బుల్లోడు ఒకవైపు మోహన్ బాబు పెద రాయుడు ఒకవైపు రాసాం.
పెద రాయుడు షూటింగ్ అపుడు బ్రహ్మానందం, బాబూ మోహన్ భలే బుల్లోడు షూటింగ్ ఉందని అపద్దం చెప్పి పెద రాయుడు షూటింగ్ నుండి వెళ్లిపోయారు. రెండు సినిమాలకు నేనే పనిచేస్తుండటం వల్ల డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి నన్ను పిలిచి షూటింగ్ రేపు ఆ సినిమా ఉందా అనడిగారు. వీళ్ళు అపద్ధం చెప్పిన విషయం తెలియక లేదని చెప్పాను. మోహన్ బాబు గారికి ఫోన్ చేసి డైరెక్టర్ విషయం చెప్పారు. బ్రాహ్మనందం గారికి, మోహన్ బాబు గారికి పెద్ద గొడవ జరిగింది. ఇక నా కెరీర్ పోయినట్లే అనుకున్నాను. నాకు సంబంధం లేని విషయం వల్ల నా పని అయిపోయింది అనుకున్నా, ఆ తరువాత చాలా రోజులు బ్రహ్మానందం గారు మాట్లాడలేదు. నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. చాలా కాలం తరువాత అపార్థం తొలగింది అంటూ చెప్పారు రమేష్ రెడ్డి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…