Bigg Boss 7: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి రియాలిటీ షోలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలో ఎంతో విజయవంతంగా ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే తెలుగులో కూడా ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది.
ఎలాంటి హింట్ లేకుండా తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన చిన్న ప్రోమో వీడియోను స్టార్ మా విడుదల చేసింది. దీనితో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని భావిస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి కంటెస్టెంట్లు ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది.
గతంలో మాదిరి కాకుండా ఈసారి అందరూ మంచి పేరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలను ఆహ్వానించి ఈ కార్యక్రమం మరింత ఎంటర్టైన్ చేసేలా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేశారట. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ కార్యక్రమానికి హోస్టుగా ఎవరు వ్యవహరించబోతున్నారనే వార్త కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ రెండవ సీజన్ కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అనంతరం మిగిలిన సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.అయితే నాగార్జున హోస్ట్ గా ఉండటంతో కంటెస్టెంట్లకు సీరియస్ నెస్ లేదని అందుకే ఈసారి హోస్ట్ ను మార్చాలని పలువురు భావిస్తున్నారు. అయితే ఈసారి మరొక స్టార్ హీరో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…