Yamudiki Mogudu : 1988 సంవత్సరం రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం యముడికి మొగుడు. మెగాస్టార్ చిరంజీవి, రాధా, విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమాలో యముడిగా కైకల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, విలన్స్ గా రావు గోపాల రావు గొల్లపూడి మారుతి రావు కమెడియన్ సుధాకర్ నటించారు. ఇక ఈసినిమా అప్పటి వరకు చిరంజీవి నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. సుధాకర్ ను తెలుగు సినిమాకు కమెడియన్ గా అందించింది.
నలుగురు స్నేహితులు కలిసి తీసిన చిత్రం…..
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తొలి రోజుల్లోనే చిరంజీవి, నారాయణ, హరిప్రసాద్, సుధాకర్ మంచి మిత్రులు. నలుగురు ఒకే రూమ్ లో ఉండి సినిమాల కోసం ప్రయత్నించే వారు. ఇక అవకాశాలు వచ్చాక ఎవరికి వారు బిజీ అయ్యారు. ఇక చిరంజీవి తెలుగు సినిమాల్లో హీరోగా హిట్లనందుకుంటూ ఎదుగుతున్నారు. సుధాకర్ తమిళ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్నారు. హరిప్రసాద్, నారాయణ కూడా సినిమాల్లో బిజీ అయ్యారు. ఇక అప్పటికే దేవాంతకుడు సినిమాను చిరుతో తీసిన నారాయణ మరో సినిమా తీయాలని భావించారు, కానీ చిరంజీవి నువ్వు, సుధాకర్, హరిప్రసాద్ కలిసి తీయండి చేస్తాను అని అన్నారట. ఈసినిమా ఆర్థికంగా నిలబెడుతుందని ఆయన నమ్మకం.
ఇక నలుగురు కలిసి సినిమా చేద్దామని అనుకున్నాక నారాయణ, హరిప్రసాద్ చాలా కథలను విన్నా ఏవి నచ్చలేదు, ఇక సత్యానంద్ చెప్పిన ఒక లైన్ చాలా నచ్చింది. ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఉంటారు ఆ పాయింటును యముడికి లింక్ చేసి సినిమా తీద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఇక సినిమా కోసం డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్ ను స్థాపించారు. ఆ పేరును కూడా చిరంజీవి నే సూచించారు.
ఇక సినిమాలో అప్పటివరకు విలన్ గా చేస్తున్న సుధాకర్ ను కమెడియన్ గా చూపించారు. చిన్న సినిమాలకు సంగీతాన్ని అందించే రాజ్ కోటి లను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. డైరెక్టర్ గా రవి రాజా పినిశెట్టి ని అల్లు అరవింద్ సిఫార్సు చేసారు. కోటి పాతిక లక్షల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈసినిమా ఘన విజయం అందుకుంది. సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్. కాళీ అనే రఫ్ పాత్రలోనూ, బాలు అనే సాఫ్ట్ పాత్రలోనూ రెండు వేరియేషన్స్ లోనూ నటించి చిరు మెప్పించాడు. ఇక హీరోయిన్స్ రాధా, విజయశాంతి పోటాపోటీగా నటించారు. సినిమా చాలా థియేటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుని మంచి విజయాన్ని నమోదు చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…