Categories: FeaturedMovie News

Srikanth: ఊహ తల్లిదండ్రుల ముందే తనకు లవ్ ప్రపోజ్ చేసిన శ్రీకాంత్.. ఊహ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదే?

Srikanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరియర్ మొదట్లో ఒకట్రెండు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన అనంతరం కుటుంబ కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ యంగ్ హీరోలకు బాబాయి పాత్రలో నటిస్తూ సందడి చేయడమే కాకుండా విలన్ గా కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Srikanth: ఊహ తల్లిదండ్రుల ముందే తనకు ప్రపోజ్ చేసిన శ్రీకాంత్.. ఊహ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదే?

ఇకపోతే ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటన ద్వారా అందరినీ మెప్పించిన శ్రీకాంత్ నటి ఊహను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఊహ తో కలిసి సుమారు నాలుగు సినిమాలలో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం ఆమె. ఈ సినిమాతోనే శ్రీకాంత్ ఊహ ప్రేమలో పడ్డారు.ఇక తనపై ప్రేమతో నిత్యం తనని తన ఇంట్లో జరిగే ఫంక్షన్లకు తీసుకు వెళుతూ తన కుటుంబానికి దగ్గర చేశారు.

Srikanth: ఊహ తల్లిదండ్రుల ముందే తనకు ప్రపోజ్ చేసిన శ్రీకాంత్.. ఊహ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదే?

ఈ విధంగా ఊహ పై ఉన్న ప్రేమను శ్రీకాంత్ బయట పెట్టలేదు.అయితే తన కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో తనకు ఊహ అంటే ఇష్టమని శ్రీకాంత్ తెలియజేశారు.అదేవిధంగా ఊహ కోసం ఒక బంగారు గొలుసు తీసుకుని తన ఇంటికి వెళ్లి దేవుడి దగ్గరకు వెళ్లి తన తల్లిదండ్రులను కూడా అక్కడికి పిలిచి తను కొన్న బంగారు గొలుసును ఊహ మెడలో వేసి తనంటే ఇష్టమని తనను పెళ్లి చేసుకుంటానని తన ప్రేమను వ్యక్తపరిచారు.

రోహన్ తల్లి పాత్రలో చేయాలని కోరిక…

ఈ విధంగా ఊహ శ్రీకాంత్ వివాహం జరిగిందని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇకపోతే పెళ్లయిన తర్వాత ఊహ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈమె ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం కేవలం తన పిల్లల బాధ్యతలను నెరవేర్చడం కోసమే తాను ఇండస్ట్రీకి దూరమయ్యారని ప్రస్తుతం వారి ఎదుగుదల ముఖ్యమని తెలియజేశారు. ఇకపోతే తన లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉండదని ఒకవేళ నటించాల్సి వస్తే తన కొడుకు రోషన్ కి తల్లిపాత్రలో నటించాల్సి వస్తే తన భర్త శ్రీకాంత్ తో కలిసి నటిస్తానని తనకు ఆ కోరిక ఒక్కటే ఉందని ఊహ వెల్లడించారు.ఇక శ్రీకాంత్ నటించిన సినిమాలో తనకి తారక రాముడు, ఖడ్గం సినిమాలంటే ఎంతో ఇష్టమని ఊహ తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago