Featured

Chiranjeevi: కేక్ లో విషం పెట్టి చిరంజీవిపై విషప్రయోగం… అతని ఎదుగుదలను ఓర్చుకోలేక పోయారా?

Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీ ఉన్నత స్థాయికి ఎదుగుతారు అంటే అతని తొక్కేయాలని చాలా మంది భావిస్తూ ఉంటారని ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో అద్భుతమైన టాలెంట్ తో ఎన్నో సినిమా అవకాశాలు అందుకుని సినిమాలలో విజయవంతంగా దూసుకుపోతూ మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Chiranjeevi: కేక్ లో విషం పెట్టి చిరంజీవిపై విషప్రయోగం… అతని ఎదుగుదలను ఓర్చుకోలేక పోయారా?

ఇలా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలి. మెగాస్టార్ అయిన తర్వాత ఈయన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎన్నో సహాయ సహకారాలను చేస్తున్నారు. ఇకపోతే గతంలో మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలను ఓర్వలేక కొందరు ఆయన పై విష ప్రయోగం చేశారు. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరి ఈ విష ప్రయోగం నుంచి చిరంజీవి ఎలా బయట పడ్డారు? విష ప్రయోగం ఎలా జరిగింది? అనే విషయానికి వస్తే….

Chiranjeevi: కేక్ లో విషం పెట్టి చిరంజీవిపై విషప్రయోగం… అతని ఎదుగుదలను ఓర్చుకోలేక పోయారా?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతూ అగ్ర హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన ఎదుగుదలను చూసి ఎంతో మంది దర్శక నిర్మాతలు ముక్కున వేలు వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఎదుగుదలను చూసి ఈయనకు ఇండస్ట్రీలో శత్రువులు కూడా పెరిగి పోయారు. ఈ క్రమంలోనే మరణమృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా కేక్ లో విషం పెట్టి మెగాస్టార్ చిరంజీవిని చంపాలని ప్లాన్ చేశారు.

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి కేవలం ఇంట్లో తయారు చేసిన భోజనాలను మాత్రమే తినేవారు. ఎట్టి పరిస్థితులలోనూ బయటకు ఆహార పదార్థాలను తినరు. అయితే మరణ మృదంగం సినిమా మద్రాసులో షూటింగ్ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున చిరంజీవిని చూడడం కోసం అభిమానులు వచ్చారు.అయితే చాలా సేపటినుంచి అభిమానులు బయట వెయిట్ చేస్తున్నారని మేనేజర్ చెప్పడంతో గేట్ వరకు వెళ్లి వారికి కనిపించిరావాలని మెగాస్టార్ ఎక్కడికి వెళ్లారు.

చిరంజీవి గేటు దగ్గరకు వెళ్లగానే ఒక అభిమాని ఆయన కాళ్ళపై పడి ఈ రోజు నా పుట్టిన రోజు మీరు పక్కనుండి కేక్ కట్ చేయించాలి అని బ్రతిమాలాడు. అభిమాని కోరిక కాదనలేక చిరంజీవి తన పక్క నుండి స్వయంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. ఇక కేక్ కట్ చేసిన అభిమాని చిరంజీవి తినిపించాలని ప్రయత్నం చేశారు.మెగాస్టార్ చిరంజీవి తాను షూటింగ్ లో ఉన్నానని ఇలా బయట పదార్థాలు తినకూడదు అంటూ చెబుతున్నప్పటికీ వినకుండా అభిమాని చిరంజీవి నోట్లో కేక్ పెట్టారు. అయితే ఇలా అభిమానుల తోపులాటలో కేక్ మొత్తం కిందపడిపోయింది. ఆ కేక్ మధ్యలో నీలిరంగు ఉండడంతో అనుమానం వచ్చిన మెగాస్టార్ కేక్ బయటకు పడేసి నోరు మొత్తం శుభ్రం చేసుకున్నారు.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన మెగాస్టార్…

అయితే తన అసిస్టెంట్ చిరంజీవి పెదాలను గమనించి నేను లిప్స్టిక్ వేసిన మీ పెదాలు నీలి రంగులోకి మారిపోయాయని చెప్పారు.అసిస్టెంట్ అలా చెప్పే సరికి వెంటనే చిరంజీవి దర్శకనిర్మాతలకు ఈ విషయం తెలియ జేసే హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ల పరీక్షించిన అనంతరం ఆయన పై విషప్రయోగం జరిగిందని చెప్పడంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది.ఇక ఆ రోజు రాత్రి మొత్తం హాస్పిటల్ లోనే ఉన్న చిరంజీవి మరుసటి రోజు ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. చిరంజీవి సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే ఆరోజు ప్రాణాలతో బయటపడ్డారు.ఇక అప్పటి నుంచి చిరంజీవి ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే వారు. ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా తనకు ధైర్యం చెప్పారు. ఈ విధంగా ఈ వార్త అప్పట్లో పెద్దఎత్తున సంచలనం సృష్టించింది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

4 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

4 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

4 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

4 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

4 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

4 hours ago