ప్రస్తుత సమయంలో కొంతమందికి చేతిలో సినిమాలు లేకున్నా సోషల్ మీడియా వేదికగా నిత్యం ఫ్యాన్స్ కు నటీమణులు టచ్ లో ఉంటున్నారు. అంతేకాకుండా తమ అందాలను ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకునే పేరు హాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ . అయితే ఈమె జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్న సమయంలో ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అందరూ ఆమె వివాహం గురించి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జార్జ్ పనాయొటోతో ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసిందని ఓ న్యూస్ బయటకు వచ్చింది.
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందట. ఇలా పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె గురించి కొన్ని రోజులు హాట్ టాపిక్ అయింది. విదేశీ అమ్మాయి అయినా ఇండియాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మొదట ఈమె మద్రాసీ పట్టణం అనే తమిళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఇందులో బ్రిటీష్ యువరాణి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
తర్వాత రామ్ చరణ్ సరసన ఎవడు మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తర్వాత శంకర్ దర్శకత్వం వహించిన ఐ సినిమాలో కూడా నటించి మెప్పించింది. తర్వాత ‘రోబో 2.0′ సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈమెకు ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా ఆమె పెట్టే ఫొటో షూట్ మాత్రం వైరల్ గా మారుతాయి. ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ బ్యూటీ కదా.
ఫలితంగా ఆ పిక్స్‌కు కొన్ని లక్షల్లో లైకులు రావడంతో పాటు అమీ జాక్సన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ గణణీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఇలా ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఇలా ఆమె ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…