దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా కేసుల సంఖ్య పెరగడం లేదు. కరోనా బాధితుల వైద్య చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతూ ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా బాధితులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తోంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు 1,33,080 మంది లబ్ధిదారులు ఐదు లక్షల రూపాయల చొప్పున రుణం పొందారని వెల్లడించారు. రుణం పొందిన వాళ్లలో తెలంగాణకు చెందిన వాళ్లు 3,389 మంది ఏపీకి చెందిన వాళ్లు 2,791 మంది ఉన్నారని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే ఈ రుణాలను టర్మ్ రుణాలుగా పరిగణిస్తారని కేంద్రం తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు మంజూరు చేసిన ఈ రుణాలను మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించడం గమనార్హం. సమీపంలోని ప్రభుత్వ రంగ బ్యాంకును సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
కరోనా సోకి చికిత్సకు ఎక్కువ మొత్తం ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడితే ఈ విధంగా సులభంగా రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గినా జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…