ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయ్యారు. టెక్నాలజీకి అనుకూలంగా వాళ్లు కూడా ముందుకు సాగుతున్నారు. సాంకేతికతను కూడా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఇటువంటి నేరాలు కొన్ని వేల సంఖ్యలో జరిగాయి. అపరిచిత వ్యక్తిగా లిఫ్ట్ అడిగి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ మరో ముఠాను ముందుగానే ఉంచి.. అతడి దగ్గర ఉన్న మొత్తం సొమ్మును దోచేసి పారిపోతున్నారు.
ఈ సంఘటనలో ఒక్కోసారి ప్రాణాలను కూడా తీయడానికి వెనుకాడటం లేదు. సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో ఇలాంటివి కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇటీవల ఓ యువకుడు హనీట్రాప్ లో పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని ఘట్ కేసర్ కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటాడు.
ఏ అప్ డేట్ వచ్చినా వెంటనే ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటాడు. ఇలా ఓ రోజు అతడికి ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఓ యువతి పరిచయం అయింది. తర్వాత వారి వాట్సాప్ నంబర్లను మార్చుకొని ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ.. ఆమె ప్రేమలో పడినట్లు నమ్మించింది. ఓ రోజు అతడితో నగ్నంగా వీడియో కాల్ చేయించి.. సీక్రెట్ గా దానిని మొత్తం రికార్టు చేసింది. అప్పటి నుంచి ఆ యువకుడిని వీడియోను అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టడం ప్రారంభించింది.
ఆ వీడియో దాదాపు 40 సెకన్ల వరకు ఉంటుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయకుండా ఉండాలంటే.. రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏం చేయాలో అర్థం గాక అతడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారని.. తనను వారి చెర నుంచి కాపాడాలని వేడుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…