గుడ్డు పేలింది అనే మాట వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఇంగ్లాండ్‌లోని బోల్టాన్‌లో నివసిస్తున్న చాంటెల్లే కాన్వే అనే మహిళ కోడుగుడ్డు పేలడంతో ముఖం, మెడ కాలిపోయాయి. దీంతో సదరు మహిళ గాయాలతో ఆసుపత్రి పాలై ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. అసలు గుడ్డు ఎలా పేలిందనే విషయానికి వస్తే…
సదరు మహిళ టిక్ టాక్ వీడియోలను చూసి కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో ఉడక పెడుతుంది. మైక్రోఓవెన్ లో గుడ్లు ఎంతో సులభంగా, తొందరగా ఉడుకుతాయనే ఉద్దేశంతో ఈ మహిళ గత కొంత కాలం నుంచి ఇదే పద్ధతి అనుసరిస్తోంది. అయితే తాజాగా ఆమెకు కోడిగుడ్లను ఉడకబెట్టడం ద్వారా అనుకోని సంఘటన, చేదు అనుభవం ఎదురయింది.
ఎప్పటిలాగే కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో ఒక గాజు పాత్రలో నీటిని పోసి ఉడక పెట్టింది పది నిమిషాల తర్వాత కోడి గుడ్లు ఉన్న గిన్నెను బయటకు తీసి కోడిగుడ్లను బయటకు తీయడం కోసం ఒక చల్లని స్పూన్ గిన్నెలో పెట్టగానే కోడిగుడ్డు బాంబు మాదిరిగా పేలింది.దీంతో గిన్నెలో ఉన్నటువంటి వేడి నీళ్ళు ఒక్కసారిగా ముఖానికి, మెడకు ఎగరడంతో ఆమె మొహం పై తీవ్రమైన గాయాలు ఏర్ప డ్డాయి.
వేడినీళ్లు ఎగిరే సమయంలో మహిళ కళ్ళు మూసుకోవడం వల్ల కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో కేవలం తన 18 నెలల చిన్నారి మాత్రమే ఉండటంతో ఆమె ఆసుపత్రికి చేరి చికిత్స తీసుకోవడానికి గంట సమయం పట్టింది. ఈ క్రమంలోనే కోలుకున్న మహిళ ఇకపై ఎవరూ కూడా కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో పెట్టి ఉడికించవద్దని తెలిపింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…