ఈ కాలంలో చాలా మంది, చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిల చుట్టూ తిరుగుతుంటారు. అయితే మన అందరికి తెలియని విషయం ఏంటంటే మనం అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉందన్న విషయం చాలామందికి తెలియదు.
ఒకవేళ తెలిసిన కానీ ఎవ్వరు పట్టించుకోరు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన నిత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ క్రింది తెలిపిన చిట్కాలు పాటించడం వల్ల మీ ఆరోగ్యానికి ఏటువంటి ఇబ్బంది ఉండదు.
కంటి నిద్ర నిద్ర
మొదటగా మనం గుర్తు పెట్టుకోవలిసిన విషయం ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ మన చేతుల్లోనే వున్న ఆ ఆరోగ్య సూత్రాలు ఏంటో తెలుసుకోండి. ముందుగా కంటికి సరిపడా నిద్ర పోవాలి. అయితే నిద్ర మంచిది అన్నాము కదా అని ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పోకూడదు. అందుకనే నిద్ర కోసం ఒక ఆరోగ్యకరమైన సమయ పాలన పాటించాలి. ఆ సమయం ప్రకారం నిత్యం నిద్రపోవాలి. రోజుకి కనీసం 8 గంటల నిద్ర అవసరం. 8 గంటలపాటు నిద్రపోవడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులని దరి చేరనివ్వకుండా చేస్తుంది.
మంచి ఆహరం
అలాగే మంచి ఆరోగ్యానికి చక్కటి పౌష్టికాహరం ఎంతో మేలు చేస్తుంది. అందుకనే పీచు పదార్ధం అధికంగా వుండి, కొవ్వు తక్కువగా వుండే పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి. వేపుడు చేసిన ఆహార పదార్థాలు కాకుండా ఉడకబెట్టిన తేలికపాటి ఆహార పదార్ధాలు తినాలి. తద్వారా అధిక మొత్తంలో కొవ్వు, క్యాలరీలు శరీరంలోకి చేరకుండా జాగ్రత్తపడవచ్చు. అలాగే పండ్లు, పచ్చి కూరగాయల ముక్కలను, సలాడ్‌గా తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన స్థాయిలో విటమిన్లు, ప్రొటీన్లు లభిస్తాయి.
క్రమం తప్పకుండ వ్యాయామం
అలాగే శరీరానికి సరిపడా వ్యాయామం ఉండాలి. నిత్యం 30 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయమం చక్కటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. అలా వ్యాయమం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో అధికంగా కొవ్వు చేరదు. నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. పైన చెప్పిన నియమాలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.. !!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…