YS Bharathi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉండగా పులివెందులలో మాత్రం జగన్ తరుపున తన భార్య వైయస్ భారతి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పులివెందులలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి గడపగడపకు వెళ్తూ ఈమె జగన్ పరిపాలన గురించి అడగడమే కాకుండా ఓట్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి వేసే ఆశీర్వదించాలని కోరుతున్నారు. గ్రామాలలో పర్యటించినటువంటి భారతి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుందని మీడియా సమావేశాలలో వెల్లడించారు.
ఇలా ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి భారతీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈమె ఎన్నో వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయ విషయాల గురించి కూడా ప్రస్తావనకు వచ్చారు. ఈ క్రమంలోనే జగన్ జైలుకు వెళ్లినటువంటి సమయంలో తమ పరిస్థితుల గురించి వివరించారు.
ఊపిరి తీసుకోలేకపోయాము..
అక్రమాస్తుల కేసులో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనని జైలుకు తీసుకువెళ్లారు అలా జగన్ మోహన్ రెడ్డి గారిని జైలుకు తీసుకు వెళ్లేటప్పుడు తనకు చాలా బాధ కలిగిందని భారతి వెల్లడించారు. ఆరోజు గాలి కూడా తీసుకోలేనంత బాధ కలిగిందని, బయటకు రావడానికి చాలా రోజుల సమయం పట్టిందని తెలిపారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలరనే ధైర్యం వచ్చింది అంటూ భారతి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…