Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరొక ఏడు రోజుల మాత్రమే సమయం ఉంది. ఇలా సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున రాజకీయ వేడి రాజుకుంది. ప్రచార కార్యక్రమాలకు కూడా కేవలం నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే సినీ నటుడు పోసాని కృష్ణమురళి వైయస్సార్సీపి పార్టీ నాయకుడిగా పని చేస్తూ పార్టీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటమే కాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు అందరూ కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేసే సమర్థుడని తెలిపారు అలాగే సంపద సృష్టించగలరని తెలిపారు..
ఇలా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించగలిగే సత్తా తనకు ఉందంటూ టిడిపి నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై పోసాని స్పందించారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క రూపాయి అయినా సంపద సృష్టించారని కనుక నిరూపిస్తే ఇప్పుడే నేను చంద్రబాబు నాయుడుకి కాళ్లు కడిగి తన పార్టీలో చేరిపోతాను అంటూ సవాల్ విసిరారు.
150 అడుగుల విగ్రహం పెడతా..
అంబేద్కర్ విగ్రహం కన్నా పెద్దది 150 అడుగుల చంద్రబాబు విగ్రహం పెట్టిస్తా. ఒక్క రూపాయి సంపద సృష్టించినట్లు నోటితో చెప్పినా చాలు. ప్రతీ బడ్జెట్ లోటులో ఉందన్న విషయం అందరికీ తెలుసు. మరి సంపద ఎక్కడి నుంచి సృష్టించారు? కనీసం వంకాయ చెట్టు, బీరకాయ చెట్టు అన్నా సృష్టించావా బాబూ? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ అంటూ బాబు పై విమర్శలు చేస్తూ పోసాని చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…