AP Politics: అవినాష్ హత్య చేయడం మీరు చూశారా.. ప్రశ్నించిన వైయస్ విమలమ్మ !

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ కుటుంబంలోనే చీలికలు మొదలవడంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత చెల్లెలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టడంతో రాజకీయం మరింత వేడెక్కింది. వైయస్ షర్మిల వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఇద్దరు కలిసి తన అన్నకు ఓటు వేయొద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు.

తన తండ్రిని చంపిన వారిని జగనన్న సపోర్ట్ చేస్తున్నారని వాళ్లను కాపాడుతున్నారంటూ సునీత ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి లేదంటూ వైయస్ షర్మిల మీటింగ్స్ పెట్టి మరి విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరి వైఎస్ విమలమ్మ షర్మిల సునీతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినాష్ రెడ్డి వివేకానందను చంపారని మాట్లాడుతున్నారు. అవినాష్ వివేకానీ చంపినప్పుడు మీరు అక్కడే ఉన్నారా మీరు చంపడం చూశారా అంటూ ప్రశ్నించారు. శత్రువుల ఊబిలో మీరు చిక్కుకొని సొంత కుటుంబంలోని వ్యక్తుల పట్ల ఇలా మాట్లాడటం మంచిది కాదని ఈమె హిత బోధ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. జగన్ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి శత్రువులతో మీరు చేతులు కలిపారని విమలమ్మ తెలిపారు.

ఇకనైనా నోర్లు ముయ్యండి..
మీకు దైవభక్తి పోయింది ఇద్దరు కలిసి జగన్ ను అలాగే అవినాశ్ ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా మీపై ఒక్క చిన్న మాట కూడా అనలేదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి ఎంత మంది శత్రువులు ఉన్నారో ఇప్పుడు మీరు వారిలో కలిసిపోయి జగన్ పై విమర్శలు చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా ఈ విషయాలను గుర్తించుకొని మీరు మాట్లాడటం ఆపేయండి అంటూ తనదైన స్టైల్ లోనే విమలమ్మ షర్మిల సునీత పట్ల చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago