Categories: FeaturedMovie News

AP politics: టీడీపీ క్యూ కడుతున్న వాలంటీర్లు.. నెల్లూరు టీడీపీలోకి 40 మంది వాలంటీర్లు!

AP politics: ఏపీ పాలిటిక్స్ ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ కూడా తిరుగుతున్న సంగతి మనకు తెలిసిందే ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి అంటూ చెప్పడంతో ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్లను ప్రజల సేవకు దూరం చేశారని వైసిపి ఆరోపణలు చేసింది. ఇలా ఏపీ రాజకీయాలలో వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి.

ఇకపోతే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 లకు ఒక వాలంటీర్లను నియమిస్తూ సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. అయితే ఈయన వాలంటీర్స్ సేవలకు గాను గౌరవ వేతనంగా 5000 రూపాయలు అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని అయితే వారికి పదివేల రూపాయల జీతం పెంచుతానని ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో తెలిపారు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పడంతో పెద్ద ఎత్తున వాలంటీర్ లు టిడిపిలోకి వలసలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఏకంగా 40 మంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారందరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

టీడీపీలోకి వాలంటీర్లు..

వచ్చే ఎన్నికలలో కూటమి అధికారంలోకి వస్తుందని భావించినటువంటి ఎంతోమంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అయితే కూటమి అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వేతనం ఇస్తారని ప్రకటించడంతో వాలంటీర్లు కూడా తమ పార్టీలోకి వస్తున్నారని ఇలా వారు తమ పార్టీలోకి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago