YSRCP: 2019 ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని అద్భుతమైన రికార్డు సాధించి అధికారం ఏర్పాటు చేస్తుంది. ఇక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన పైన అలాగే సంక్షేమం పైన దృష్టి సారించి ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 99% అమలుపరిచారు.
ఇలా ఒకవైపు సంక్షేమం అందిస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కూడా తీసుకువెళ్లారు. అయితే ఈసారి గతంలో కంటే మించిన స్థానాలు వస్తాయని భావించారు కానీ వైసీపీకి మాత్రం ఊహించని ఫలితాలు దక్కాయి. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఎక్కడ ఏం తప్పు జరిగిందనే విషయంపై వైసీపీ శ్రేణులు నాయకులు కూడా ఆరా తీస్తున్నారు.
ఇకపోతే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి అధికంగా ఓట్లు వచ్చాయనే విషయం గురించి జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో టిడిపికి మొదటి ఐదు స్థానాలలో చోటు దక్కకపోవటం గమనార్హం. ఈసారి ఎన్నికలలో 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇలా భారీ స్థాయిలో మెజారిటీ దక్కించినప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ లో వైసీపీను బీట్ చేయకపోవడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లు షాక్ లో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో వైసిపి అయిదవ స్థానంలో ఉండటం విశేషం. మొదటి నాలుగు స్థానాలలో ఉన్న పార్టీలన్నీ కూడా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాయి కానీ ఎలాంటి పార్టీతో పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగి వైసిపి ఏకంగా 2.06 ఓటు శాతంతో ఐదు స్థానంలో నిలవడం విశేషం.
ఐదో స్థానంలో వైసీపీ…
ఇక జనసేన అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ ఏడో స్థానంలో ఉంది. 1.98 శాతంతో ఏడో స్థానంలో ఉండటం గమనార్హం. ఇక ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తెలియచేయడంతో వైసిపి అభిమానులు ఇప్పటికైనా అర్థమైందా ఎవరి స్టామినా ఏంటో పొత్తు లేకపోతే ఈసారి కూడా కూటమి అధికారంలోకి రాదంటూ ఈ జాబితా పై కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…