Kannappa: మంచు విష్ణు నటిస్తున్నటువంటి తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ టీచర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ టీజర్ కార్యక్రమంలో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కన్నప్ప సినిమా ఏ తరానికైనా చాలా కొత్తగా ఉంటుందని ఈయన తెలిపారు. భక్తి బావం ధూర్జటి మహాకవి ఎలా రాశారు శ్రీకాళహస్తి మహత్యం ఏమిటి అనే విషయాలన్నింటిని కూడా ఇందులో తెలియచేశామని తెలిపారు.
కన్నప్ప అనే సినిమా కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు ఇందులో అన్ని అంశాలు ఉంటాయని ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా చేస్తున్నామని తెలిపారు. ఎంతో ఖర్చులతో ప్రయాసలతో కూడిన ఈ సినిమాలో ఇండస్ట్రీలోనే స్టార్ సెలబ్రిటీలందరినీ భాగం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు.
విష్ణు కోసం ఇచ్చేశారు..
ఇక నిర్మాతగా ఆ శివయ్య ఆశీస్సులు నాపై మాత్రమే కాకుండా చిత్ర బృందం అలాగే ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా గురించి నేను కృష్ణంరాజు వద్దకు వెళ్లి మాట్లాడాను ఆయన ప్రభాస్ కోసం రాసుకున్న కన్నప్ప కథను మాకు ఇచ్చేసారని ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాణంలో మోహన్ బాబు కూడా భాగం కావడం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…