Niharika: నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిహారిక మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు మీడియా నుంచి వివిధ రకాలుగా ప్రశ్నలు ఎదురయ్యాయి.
ముఖ్యంగా ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మెగా వెర్సెస్ అల్లు అనే విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే మెగా సంబరాలలో కానీ పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కానీ అల్లు కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు.
ఇకపోతే మెగా హీరో అయినటువంటి సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డిని కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో ఈయన అన్ ఫాలో కావడంతో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే మీడియా వారు తేజ్ బన్నీని అన్ ఫాలో చేయడం గురించి ప్రశ్నించారు.
అవునా.. నిజమా
మీడియా వారి నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురు కావడంతో నిహారిక స్పందిస్తూ అవునా నిజమా మీరు చెప్పే వరకు నాకు అసలు తెలియదు అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు అలాగే అన్ ఫాలో చేసి ఉంటారంటే ఎవరి రీజన్స్ వారికి ఉంటాయి కదా అంటూ ఈమె ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు.. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…