Categories: FeaturedMovie News

Raviteja: తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రవితేజ.. వైరల్ అవుతున్న హరీష్ శంకర్ పోస్ట్?

Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రవితేజ సైతం వరుస కాల్ షీట్స్ సినిమా కోసం కేటాయించారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లోకేషన్ నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటో చూస్తున్నటువంటి అభిమానులు ఒక్కసారిగా కంగారు వ్యక్తం చేస్తున్నారు. రవితేజకు ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలో భాగంగా రవితేజ మెడకు బెల్ట్ పెట్టుకుని ఉండగా పక్కనే హరీష్ శంకర్ దానిని పట్టుకొని ఉన్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈయన రవితేజ మెడకు తీవ్రమైన నొప్పి వస్తుందని వెల్లడించారు.

మెడ నొప్పి సమస్య..
మీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్.. ఇంత తీవ్రమైన మెడ నొప్పిలో కూడా షూటింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు థాంక్యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈయన తీవ్రమైన మెడ నొప్పి సమస్యతో బాధపడుతున్నప్పటికీ షూటింగ్ ఆగిపోకూడదని నిర్మాతలు నష్టపోకూడదని తన నొప్పిని సైతం లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొన్నారు తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago