Shyamala: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో శ్యామల ఒకరు. అయితే ఈమె ప్రస్తుతం వైసీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తన భర్తతో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరినటువంటి ఈమె ప్రస్తుతం పలు నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక మీడియా సమావేశంలో భాగంగా ఈమె పిఠాపురం నియోజకవర్గం గురించి అక్కడ పరిస్థితుల గురించి తెలిపారు. పిఠాపురంలో వంగా గీతా గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని తెలిపారు. వంగా గీత సీనియర్ నాయకురాలు అక్కడ ఎన్నో అభివృద్ధి పనులను చేశారు. తప్పకుండా ఆమె గెలుస్తుందని ఆమె గెలుపు ఖాయమైందని శ్యామల తెలిపారు.
ఇక వంగా గీతకు పోటీగా ఎన్నికల బరిలో దిగినటువంటి పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఈయన మాత్రం ఎంతోమంది సినిమా వాళ్ళని తెచ్చుకొని ఎన్నికలలో పోటీ చేస్తున్నారని ఈమె తెలిపారు. ప్రజలు ఎప్పుడూ కూడా అభివృద్ధికి మద్దతు తెలిపాలని ఈమె పిలుపునిచ్చారు.
గీతా గెలుపు ఖాయం..
పిఠాపురంలో అభివృద్ధి వంగా గీత వల్లే జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే జరిగిందని అందుకే అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని వంగా గీత గెలుపు ఖాయం అంటూ ఈ సందర్భంగా శ్యామల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…