Shruthika Samudrala : బుల్లి తెరపై ఎన్నో సింగింగ్ డాన్సింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఎంతోమందిలో దాగి ఉన్న టాలెంట్ ను బయటకు తీసుకురావడమే కాకుండా, వారికి ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలను కూడా కల్పిస్తున్నాయని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్లే బ్యాక్ సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న సరిగమప సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమం ద్వారా కూడా ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నవాళ్లు ఈ కాంపిటీషన్ లో పాల్గొని హోరాహోరీగా పోటీపడ్డారు. చివరికి ఈ సరిగమప షోలో విజేతగా శృతిక సముద్రాల నిలిచారు. జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్’ ఫినాలే కార్యక్రమంలో ‘ఏమాయె నా కవిత’, ‘మెరిసేటి పువ్వా’, ‘సంకురాత్రి కోడి’, ‘కొంచెం నీరు’వంటి అద్భుతమైన పాటలతో ఎంతగానో అందరిని ఆకట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఈమె ఈ కార్యక్రమంలో విజేతగా నిలబడమే కాకుండా ఈ కార్యక్రమానికి విజేత కాకముందే తన పాటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని ఏకంగా ఎన్నో బహుమతులను కూడా సొంతం చేసుకుంది.ఇక ఈ కార్యక్రమం ఫినాలేకు ఎనిమిది మంది కంటెస్టెంట్లు చేరగా చివరికి శృతిక సముద్రాల ఈ కార్యక్రమంలో విజేతగా నిలబడ్డారు.
ఈ కార్యక్రమానికి విజేతగా నిలబడిన శ్రుతిక మాట్లాడుతూ ఈ విజయం వెనుక తన అమ్మ కష్టం ఎంతో ఉందని ఈమె వెల్లడించారు. చిన్నప్పటినుంచి సంగీతంపై ఎంతో మక్కువ ఉండటంతో తనను సంగీతంలో తన తల్లిదండ్రులు ప్రోత్సహించారని ఇక ఈ విషయంలో తనకు తన తల్లి అండగా నిలబడటం కోసం ఏకంగా తన ఉద్యోగాన్ని కూడా వదులుకుందని ఈమె వెల్లడించారు. ఇలా తన విజయం వెనుక తన తల్లి ఉన్నారంటూ శృతిక ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…