ఒకప్పుడు సెంటిమెంట్ పాత్రకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అందాల నటి యమున. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. యమున అంటే కంటతడి పెట్టించే పాత్రలను అద్భుతంగా చేస్తుందని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ చిత్ర అభిమానులు చెప్పుకుంటారు. అందుకు కారణం యమున నటన చాలా సజహజంగా ఉండటమే. తెలుగు వారైనా బెంగుళూరులో స్థిరపడిన యమున చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలన్నీ ఆమెకి బాగా పేరు తీసుకు వచ్చాయి.
ఈమె అసలు పేరు ప్రేమ. అయితే సినిమాలలోకి వచ్చే ముందు ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ తన పేరును యమునగా మార్చారు. యమున కన్నడ సినిమా ‘మోడద మరెయల్లి’తో తన సినీ ప్రయాణం మొదలు పెట్టింది. ఈ సినిమాలో ఆమె ప్రముఖ కన్నడ నటుడు శివరాజకుమార్ సరసన నటించింది. ఈ సినిమా బాగా పేరు తీసుకురావడంతో ఇక వరుసగా సౌత్ భాషలలో నటించే అవకాశం అందుకుంది. యమున దాదాపు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా తెలుగులో విపరీతమైన పేరు సంపాదించింది. ఈ సినిమా మీడియాలో బాగా పాపులర్ అయిన ‘సబితా బధేయి’ అనే ఆమె జీవిత కథను ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఇందులో యమున ఒక ప్రభుత్వోద్యోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కుల కోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతిగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆ తర్వాత తెలుగులో అన్నీ ఎమోషనల్ డ్రామాలలోనే నటించే అవకాశాలను అందుకుంది. వినోద్ కుమార్ సరసన యమున నటించిన మామగారు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో మరో అవార్డు కూడా దక్కించుకుంది. దాంతో తెలుగులో పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి చిత్రాలలో నటనకి ఆస్కారం ఉన్న పాత్రలను చేసి క్రేజ్ సంపాదించుకుంది. కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్‌ల సరసన నటించిన సినిమాలు ఆమెకి బాగా పేరు తెచ్చిపెట్టాయి.
కాగా యమున పెళ్ళి తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. ఈటీవిలో ప్రసారమైన ధారావాహిక అన్వేషితతో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తూ ఇప్పుడు బాగా బిజీగా ఉంది. అయితే అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలలో నటించే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ యమున గతంలో బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్ ఐ.టి.సి.రాయల్ గార్డెనియాలో జరిగిన పోలీసు దాడిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.
అందుకే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమెకి అవకాశాలు దక్కడం లేదనే టాక్ ఉంది. ఈ వ్యవహారంలో యమునను అరెస్టు చేశారు. అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలు.. కావాలని సృష్ఠించినవే అంటూ కోర్టు కొట్టివేసినట్లు యమున తెలిపింది. అయినా కూడా టాలీవుడ్ మేకర్స్ ఈమెకి సినిమాలలో అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. కాగా ప్రస్తుతం ఈమె సీరియల్స్‌లో మాత్రం క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అది కూడా సినిమాలు చేయకపోవడానికి ఓ కారణం కావచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…