నందమూరి వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి వీరిద్దరూ బాబాయ్.. అబ్బాయ్ వరస అవుతారనే ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బాలకృష్ణను మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఎలా కలుసుకున్నారనే విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ తో ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ… పాలకొల్లులో ఎన్టీఆర్ హీరోగా అల్లరి రాముడు సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అదే సమయంలో అక్కడ పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ బాలకృష్ణ వంటి వారందరూ ఉన్నారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పరుచూరి గోపాల కృష్ణ దగ్గరికి వెళుతూ మీరు తాత ఎన్టీఆర్ గారికి ఎలా అభిమానో.. నేను బాలకృష్ణ గారికి అంత అభిమానిని అని తెలియజేశారు.
బాబాయి సినిమా థియేటర్ లో చూస్తుంటే పేపర్లు చించి విసిరేస్తూ ఎంజాయ్ చేశానని తెలిపారు.ఆ మాటలు విన్న పరుచూరి మరి ఈ విషయాన్ని మీ బాబాయికి చెప్పావా అని అడిగా.. లేదు నాకు బాబాయి అంటే భయం అందుకే ఈ విషయాన్ని తనకు చెప్పలేదు అనే సమాధానం చెప్పాడు. అయితే మీ బాబాయ్ కి పరిచయం చేస్తాను రా అంటూ అదే సెట్ లో ఉన్న బాలకృష్ణ దగ్గరకు ఎన్టీఆర్ చేతిని పట్టుకొని పరుచూరి గోపాలకృష్ణ తీసుకువెళ్లి బాలయ్య బాబుతో పరిచయం చేయించి మాట్లాడారట.
అలా ఎన్టీఆర్ బాలకృష్ణను బాబాయ్ మాదిరి కాకుండా, ఒక అభిమానిగా మొట్టమొదటిసారి పాలకొల్లులో కలిశారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా హీరో గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…