ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన “నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు..” అనే పాట ఎక్కడ విన్నా టక్కున ఆది సినిమా లోని కీర్తి చావ్లా గుర్తుకువస్తుంది. 2002లో బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, కీర్తి చావ్లా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇంతకుముందు వచ్చిన నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాలలో కనిపించని అగ్రెసివ్ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. ఆయన కెరీర్ లో ఆది సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
ఆ తర్వాత కీర్తిచావ్లా, రాజేంద్ర ప్రసాద్ తో ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత లక్ష్మీశ్రీనివాస్ దర్శకత్వములో వచ్చిన కాశీ అనే చిత్రంలో జె.డి.చక్రవర్తితో జంటగా నటించింది. ఆది సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎందుకో కీర్తిచావ్లాకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ క్రమంలో ముద్దు సన్నివేశాలలో నటించడానికి కీర్తి చావ్లా పచ్చజెండా ఊపారు. కాశీ చిత్రంలో జెడి.చక్రవర్తి, కీర్తిచావ్లా మధ్య ఘాటైన ముద్దు సన్నివేశాలను ఇప్పటికి అభిమానులు మర్చిపోలేరు. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆమె కెరీర్ ఉన్నతంగా కొనసాగలేదు.
తెలుగులో కూడా స్టార్ హీరోలతో నటించే అవకాశం కూడా రాలేదు. అలాంటి క్రమంలో ఆమె స్వయంగా సినిమా నిర్మాణ రంగంలోకి దిగారు. ఆ సినిమాలు విడుదలకు నోచుకోకపోవడంతో దాదాపు కీర్తిచావ్లా రోడ్డున పడేపరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో తన చుట్టూ ఉన్న సమస్యలను తట్టుకోలేక కీర్తిచావ్లా డిప్రెషన్ లోకి వెళ్లారు. కానీ ఆమె స్నేహితురాళ్ళు స్పందించి ఆమెకు ధైర్యం చెప్పి కీర్తి చావ్లాను వ్యాపార రంగంలోకి దింపడం జరిగింది. మెల్లిగా మానసిక ఆందోళన నుంచి బయట పడుతూ.. బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటన్న సమయంలో పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిర పడినట్లుగా సమాచారం.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…