Featured

ఆర్. నారాయణమూర్తి జీవితంలో కన్నీటి ప్రేమకథ..

ఆర్ నారాయణ మూర్తి. పిపుల్స్ స్టార్. డబ్బు కోసం సినిమాలు చేయడు. జనాల కోసం సినిమాలు చేస్తాడు. జనాలు దోపిడీకి గురవుతున్న విధానాన్ని సినిమాల రూపంలో తెరకెక్కిస్తాడు. జనాల్లో ఆలోచన కలిగేలా చేస్తాడు. నారాయణ మూర్తి అంటే సినీజనాలకు ఎంతో గౌరవం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఆయనకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన ఇప్పటికీ డబ్బుకోసం ఆశ పడకుండా ప్రజా సమస్యలనే కథలుగా మలిచి సినిమాలు చేస్తుంటాడు. నారాయణ మూర్తి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయనకూ ఓ ప్రేమకథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నారాయణమూర్తి డిగ్రీ చదువుకున్న రోజుల్లో ప్రేమలో పడ్డాడు. ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు. ఆమె కూడా నారాయణ మూర్తి అంటే చాలా ఇష్టపడింది. ఆయన సిద్ధాంతాలు ఆమెకు ఎంతో నచ్చేవి. ఆమెతో కొంతకాలం పాటు ప్రేమ కొనసాగించాడు. ఒకరోజు తనను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. వాళ్ల ఇంట్లో వారితో మాట్లాడాలి అనుకున్నాడు. అయితే ఆ అమ్మాయి బాగా డబ్బున్న వాళ్ల పిల్ల అని తెలియడంతో తన మనసు మార్చుకున్నాడు. తాను సినిమాలు చేసే వాడిని. మున్ముందు తన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నేను ఎలాగైనా జీవిస్తాను. కానీ అందంగా పెరిగిన అమ్మాయిని ఇబ్బంది పెట్టలేను అనుకున్నాడట. తెలిసి తెలిసి ఆ అమ్మాయిని కష్టాల్లోకి లాగలేను అనుకున్నాడట. పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాడట.

ఈ విషయం గురించి ఆ అమ్మాయితో మాట్లాడట నారాయణమూర్తి. తన జీవితం ఎలాంటిదో.. మున్ముందు ఎలా ఉండబోతుందో వివరించాడట. తన వల్ల నువ్వు బాధపడటం ఇష్టం లేదని చెప్పాడట. ఇకనై మళ్లీ నిన్ను కలవను అని చెప్పాడట. మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడపాలని చెప్పాడట. నువ్వు సంతోషంగా, సుఖంగా ఉండటమే తాను కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆ మాటలకు అమ్మాయి చాలా బాధడిందట. కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం నారాయణమూర్తి మద్రాసుకు వచ్చాడట. కొంతకాలం తనను తలచుకొని బాధపడ్డాడట. ఆ తర్వాత పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడట.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

1 minute ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

10 minutes ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

3 hours ago

స్విమ్ సూట్ ఫోటోలు పంపినా ఛాన్స్ మిస్.. నటి షాకింగ్ రివీల్

సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…

3 hours ago

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…

3 hours ago

కావాలనే ఇరికించారు.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…

3 hours ago