నటుడు మరియు సింగర్ గా పేరు తెచ్చుకున్న యోయో హనీ సింగ్ అందరికీ తెలిసిందే. తన పాటలతో, వీడియోలతో ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉండే హనీ సింగ్‌కు తాజాగా అతడి భార్య షాక్ ఇచ్చింది. ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేసింది.
ఈ మేరకు 1961 లో రూపొందించిన గృహ హింస నిదోధక చట్టం కింద పిటిషస్‌ను దాఖలు చేసింది. తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలో కోర్టు హనీ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆగష్టు 28లోగా వివరణ ఇవ్వాలంటూ కోరింది. హనీ సింగ్, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే దాదాపు 7 ఏళ్ల క్రితం ‘ఇండియాస్ రాక్ స్టార్’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను పరిచయం చేశాడు. బాలీవుడ్‌లోని పలు భారీ ప్రాజెక్ట్స్‌లో పని చేయడానికి ముందే హనీ సింగ్ వివాహం అయిందని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక దీపికా పదుకోనె, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన ‘కాక్‌టెయిల్’ చిత్రంలోని ఆంగ్రేజీ బీట్ పాటతో హనీ సింగ్ బాగా ప్రాచుర‍్యం పొందారు. ఆ తర్వాత నుంచి హనీ సింగ్ బాలీవుడ్ కెరీర్ సాఫీగా కొనసాగుతుంది.
మరి ఇప్పుడు వారి కాపురంలో ఏ జరిగిందో కానీ.. కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య జరుగుతున్న తగువులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మనస్పర్థల కారణంగానే ఇలాంటి గొడవలు జరిగాయా.. లేదా నిజంగానే హనీసింగ్ లైంగికంగా వేధించాడా.. అనేది పూర్తి వవరాలు తెలియరాలేదు. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో హనీసింగ్ కెరీర్ ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి. తన భార్య ఫిర్యాదుపై మాత్రం హనీ సింగ్ ఇంకా స్పందించలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…