Featured

ఆ సీనియర్ హీరో తన వయసు బయటపడుతుందని అన్నపూర్ణను ఆ పాత్ర వేయద్దన్నారు..!!

మన అన్న దానకర్ణ..మన తల్లి అన్నపూర్ణ.. మన కీర్తి మంచు కొండరా..తమ్ముడు..!! ఆత్రేయ ఏ సమయంలో ఆ పాట రాయడం జరిగిందో కానీ ఆ అక్షరాలన్నీ అక్షర సత్యాలే. ఆహారానికి కొదవ లేకుండా.. నిత్యం పంటలు పండించే మన దేశం. ఆహార పంటలకు అక్షయపాత్ర అని ఆత్రేయ వివరించిన అర్థం. అన్నపూర్ణ అనే మాటలో తల్లి అనే భావం ప్రస్పుటిస్తుంది. సినీనటి అన్నపూర్ణ ‌ సార్థక నామధేయురాలు. ఆమె నటించిన చిత్రాలలో ఎక్కువగా తల్లి పాత్రలు చేయడం ఓ విశేషం.

1970 ప్రథమార్థంలో ఆమె సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ 1980 దశకంలో ఆమె ప్రముఖ హీరోలందరికీ తల్లిగా నటించింది. అన్నపూర్ణ తన 13 ఏళ్ల వయసు నుంచే అనేక నాటకాల్లో వివిధ రకాల పాత్రలు ధరించింది. అలా ఒక రోజు విశాఖపట్నంలో దాసరి నారాయణరావు “నీడలేని ఆడది” సినిమా తీస్తున్న సమయంలో.. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మద్రాసు నుంచి రావాల్సి ఉండగా.. ట్రైన్స్ రాకపోవడంతో ఆమె షూటింగ్ కి హాజరు కాలేక పోయింది. అప్పుడు వెంటనే బెజవాడ నుంచి అన్నపూర్ణను పిలిపించారు. సినిమా టైటిల్ “నీడలేని ఆడది” అయినప్పటికీ అన్నపూర్ణకు ఈ సినిమాతోనే సినీ పరిశ్రమలో ఓనీడ దొరికింది. ఆ తర్వాత “చదువుకున్న అమ్మాయిలు”చిత్రంలో నటించింది. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో “స్వర్గం నరకం”అనే చిత్రంలో మోహన్ బాబు పక్కన హీరోయిన్ గా నటించింది.

అలా ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గ నటించినప్పటికీ తర్వాత తల్లి, అక్క, వదిన పాత్రలకు పరిమితమయ్యారు. యుక్తవయసులో ఉండగా ఆమెకు లవ్ ప్రపోజల్స్ రావడంతో వాటిని తిరస్కరిస్తూ ఉండేది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు బందరు కు సంబంధించిన ఓ ఉద్యోగస్తుడిని వివాహము చేసుకున్నారు. అన్నపూర్ణ ఎక్కువగా సత్యనారాయణ, రావు గోపాల్ రావు, జగ్గయ్య, గొల్లపూడికి భార్యగా నటించింది. రావు గోపాలరావు సినిమా షూటింగ్ విరామంలో భార్యగా నాతో తప్ప మరో నటుడితో వేయకూడదని సరదాగా చెప్పేవారు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, సుమన్ లాంటి హీరోలందరికీ తల్లిగా నటించినప్పటికీ, అలనాటి హీరోలలో ఎన్టీ రామారావుతో “సింహం నవ్వింది”చిత్రంలో ఆయనకు తల్లిగా నటించింది. ఆ తరువాత అక్కినేనితో తల్లి గా నటించే అవకాశం వచ్చినప్పటికీ.. అన్నపూర్ణ వయసు తక్కువగాను అక్కినేని వయసు ఎక్కువగా ఉండడంతో ఒకే ఫ్రేములో వారిద్దరిని తెరమీద చూస్తున్నప్పుడు. అక్కినేని నాగేశ్వరరావు వయస్సు ఎక్కువగా కనిపిస్తుందని, ఏఎన్ఆర్ నటించిన సినిమాలలో అన్నపూర్ణను తల్లి పాత్రకు తీసుకునే వారు కాదని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చారు. ఆమె ఈ మధ్య కాలంలో సరైనోడు, గీతా గోవిందం, ఎఫ్ 2, గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago