Featured

నీ మొగుడంటే నాకు మోజే.. అర్ధం చేసుకోవే దీప.. ప్లీజ్.. వంటలక్క వేడుకుంటున్న మోనిత!

 

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూపోతుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ నేడు1102 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో దీప రోషిని కలిసి మాస్టర్ ప్లాన్ వేసిన సంగతి తెలిసిందే. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది అనే విషయానికి వస్తే… దీప తన పిల్లలకు భోజనం పెడుతూ ఉండగా పిల్లలు ఇద్దరు సవితి తల్లి ప్రస్తావన తీసుకువస్తారు. మనకు సవతితల్లి లేదు అందుకు మనం హ్యాపీ అంటూ ఉండగా దీప పిల్లలను ఉద్దేశించి వయసుకు తగ్గట్టు మాటలు మాట్లాడండి అంటూ కోపగించుకుంటుంది.

హాస్పిటల్లో ఆనంద్ రావు దగ్గర కార్తీక్, ఆదిత్య ఉండి నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి ఉద్వేగపూరితమైన విషయాలను చెప్పకూడదు అంటూ కార్తీక్ చెబుతాడు. అయినా మోనిత తన గర్భం గురించి చెప్పింది కనుక ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు కనుక నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలని మాట్లాడుతుంటారు. ఇక మోనిత ఇంటికి వెళ్లి దీప అంజి ప్రస్తావన తీసుకురావడం…అంజి వైజాగ్ లో కనిపించకపోవడం విషయాలను గుర్తు చేసుకుని పిచ్చిదానిలా రియాక్ట్ అవుతుంది. ఈ స్థితిలో మోనితను చూసిన ప్రియమణి కంగారు పడుతుంది. అప్పుడే మోనితకు పెళ్లా? జైలా…? అని భాగ్యం, దీపా అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే మోనిత మాస్టర్ ప్లాన్ వేసి హాస్పిటల్ కు క్యారేజ్ తీసుకు వెళుతుంది.

హాస్పిటల్లో భాగ్యం ఆదిత్యకు, కార్తీక్ ను భోజనానికి రమ్మని పిలుస్తుంది. దీంతో కార్తీక్ ఆకలిగా లేదని చెబుతాడు. వెంటనే మోనిత నా చేతితో పెడితే నా కాబోయే భర్త తింటాడు అంటూ లోపలికి వస్తుంది. ఇలా మోనిత అనడంతో భాగ్యం కోపంతో క్యారేజితో కొట్టానంటే తలకాయ్ క్యాబేజిలా పగిలిపోతుందని భాగ్యం అనగా నువ్వు కొడతావని నాకు తెలుసు అందుకే విషం కలిపిన నీళ్ళు తీసుకువచ్చాను… నా చావుకు కారణం మీరేనని ముందుగా లెటర్ రాసి ఇచ్చి వచ్చాను అని బెదిరిస్తుంది. అప్పుడే డోర్ కొట్టిన శబ్దం రావడంతో కార్తీక్ వెళ్లి తలుపు తీస్తే దీప ఎంటర్ అవుతుంది. దీపక్ ఎంటర్ అవ్వగానే భాగ్యం ఇది బాటిల్ లో విషం కలిపిన నీళ్ళు తీసుకువచ్చి అందరినీ బెదిరిస్తుందని చెప్పడంతో దీప ఆవేశ పడుతుంది. తాగువే… ఈ విషయం నీళ్లు తాగు అంటూ మోనిత బెదిరిస్తుంది. పోనీ నేను తాగానా..? అంటూ బాటిల్ మూత తీసి దీప తాగుతుంది.

ఇది కేవలం నీళ్లు మాత్రమే ఈ బాటిల్ లో విషం లేదు.ఈ మోనితలో విషం ఉంది. ఇంకా ఎన్ని రోజులు బెదిరిస్తావు అది చెయ్యి కూడా కోసుకోలేదు… పిన్ని వెళ్లి నర్సును అడిగి ఆపరేషన్ బ్లేడ్ తీసుకురా చెయ్యి కోసి కారం పెడతా అనడంతో మోనిత దీప కాళ్ళపై పడి నీ పెళ్లి కాకముందే నేను కార్తీక్ ను ప్రేమించాను అంటూ.. ఆ విషయం కార్తీక్ కి కూడా తెలుసని చెబుతుంది.కార్తీక్ మాట్లాడుతూ మనిద్దరి మధ్య ప్రేమ లేదు అని చెబుతాడు.నిన్న చచ్చిన పెళ్లి చేసుకోనని కార్తీక్ తెగేసి చెబుతాడు ఆ మాట విన్న మోనిత ఎంతో కంగారు పడుతుంది. ఆ తరువాత మోనిత ఏం చేస్తుందనే విషయం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago