తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న జీ తెలుగు ఛానల్ లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. కుటుంబ కథనంతో తెరకెక్కుతున్న ఈ సీరియల్స్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే జీ తెలుగు ఛానల్ “ముత్యమంత ముద్దు”అనే సరికొత్త ధారావాహిక సీరియల్ ను ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోని ఈ సీరియల్ ను ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి చేతులమీదుగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
రుణం పేరుతో దారుణాలు చేస్తున్న అత్తమామలు, కన్న వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని బాధపడే కోడలు ఈ కాన్సెప్ట్ తో ముత్యమంత ముద్దు త్వరలోనే మీ ముందుకు రాబోతోంది అంటూ ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలోని ఈ సీరియల్ ప్రారంభోత్సవంలో భాగంగా కృతి శెట్టి బుల్లితెరపై సందడి చేశారు. దీనికోసం ఈ అమ్మడు సుమారు 5 లక్షలు అందుకుందని సమాచారం.
ఇక ఈ ప్రోమోలో భాగంగా ఓ మహిళ గీత ముహూర్తం మించిపోతుంది త్వరగా పెళ్ళి తంతు పూర్తి చేయమని చెప్పడంతో.. కృతి శెట్టి తాంబూలంతో తాళిని పట్టుకొని వస్తుంది. ఆ సమయంలో కృతి శెట్టి మరొక యువతితో మాట్లాడుతూ.. పెళ్లి జరిగితే అమ్మాయి జీవితమే మారిపోతుంది, ఇంటి పేరు, ఊరి పేరు మారుతాయి. అమ్మానాన్నలను దాదాపు మర్చిపోవాలి అని పెళ్లి గురించి సంభాషణ చేస్తూ సాగిపోయే ఈ సీరియల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…