అసలే ఇప్పుడు కరోనా కాలం. దానికి తోడు చలి కాలం కూడా వచ్చేసింది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఈ కాలంలో ఎక్కువగా ఊపిరితిత్తుల ఇబ్బందుల ఎదురవుతూ ఉంటాయి. అలాగే ధూమపానం చేసినాగాని, అ పొగ పిల్చినా గాని ఆ ప్రభావం అనేది ఊపిరితిత్తుల మీద పడుతుంది. అలాగే మనము పీల్చే గాలిలో ఉన్న కాలుష్యం, మన వంటగది నుండి వచ్చే టాక్సిక్ ఫ్యూయల్స్ వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్య వస్తుందని మనలో చాలా మందికి తెలియదు. మన శరీరంలోని టాక్సిన్లను బయటకు తీయడంలో మన ఊపిరితిత్తులు ఎంతగానో సహాయపడతాయి. మరి అలాంటి ఊపిరితిత్తులను మనమే కాపాడుకోవాలి.. అది ఎలా అనుకుంటున్నారా.
దానికి పెద్ద ఖర్చు ఏమి పెట్టనవసరం లేదు. సింపుల్ గా మన ఇంట్లో దొరికే సుగంధ ద్రవ్యాలతో మీ ఊపిరితిత్తులను మీరు బాగా చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . అది ఎలాగో తెలుసుకుందాం. ఒక చిన్న టీ స్పూన్ జీలకర్రను తీసుకుని ఒక గిన్నెలో వేయండి. తరువాత ఆ గిన్నెలోనే కొంచం మిరియాల పొడి కలపాలి. ఇప్పుడు ఆ గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఇలా నీళ్లు కొంచెం మరిగాక, వడకట్టి వేడి టీ లాగా తాగండి.అంతే మీ ఊపిరితిత్తులు శుభ్రం అయిపోయినట్లే. ఈ టీ తాగితే జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. జీలకర్ర డీకంజెస్టింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.
జీలకర్ర నీరు ఛాతీలో ఏదైనా శ్లేష్మం చేరడాన్ని తగ్గిస్తుంది. మరియు ఈ జీలకర్ర నీరు గొప్ప హైడ్రేటర్ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అలాగే మిరియాలను కలపడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఎమన్నా ఉంటే తొలగిపోతాయి. అయితే ఈ జీలకర్ర నీటిని ఎప్పుడు తాగాలి అంటే మీరు ఉదయం ప్రాణాయామం చేయడం ముగించిన తరువాత దీన్ని తాగండి. అంటే పడగడుపున సేవించాలి అన్నమాట. కొన్ని రోజుల పాటు ఇలా తాగుతూ ఉంటే తేడా అనేది మీకు అర్ధం అవుంతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఒకసారి ట్రై చేస్తే పోలా మహా అయితే ఆరోగ్యం మన సొంతం అవుతుంది అంతే…. కదా..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…