నందమూరి తారక రామారావు సినీ చరిత్రలో ఆ పేరు అజరామరం. అద్భుతమైన నటన కౌశలానికి నిలువెత్తు నిదర్శనం ఆయన పౌరాణిక చిత్రాలు. ముగ్ద మనోహర రూపం. ఆహార్యం, అభినయం ద్వపార్షములుగ ఆయన చిత్రగమనం. దిక్కులు పిక్కటిల్లేలా సంభాషణ వాచకతత్వం… అయితే ఒకరోజు సర్దార్ పాపారాయుడు షూటింగ్ జరుగుతుండగా అక్కడ విలేకరుల సమావేశం జరిగింది. అందులో ఒక విలేఖరి ఎన్టీ రామారావును ఒక ఆరు నెలలు గడిస్తే మీరు 60 సంవత్సరాల వయసులోకి అడుగు పెడతారు. కావున మీ జీవితంలో ఏదైనా గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నరా..?అని అడిగాడు.
అప్పుడు ఎన్టీ రామారావు జవాబిస్తూ… నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. ఈ తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించి అభిమానించారు. వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. కావున నా జీవితంలో ఒక నెలలో పదిహేను రోజులు వారి సేవకోసం కేటాయిస్తాను అని చెప్పారు. ఈ మాటలు తన రాజకీయ రంగ ప్రవేశానికి సాంకేతాలుగా కనిపించాయి. అలా రాజకీయ రంగ ప్రవేశం కోసం ఆయన ఒప్పుకున్న సినిమాలు కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, నా దేశం, సింహం నవ్వింది, కలియుగ రాముడు, గజదొంగ, బొబ్బిలి పులి చిత్రాలను త్వరగా పూర్తి చేసుకొని 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి 1989 వరకు అధికారంలో కొనసాగారు.
1989లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందడంతో తిరిగి సినిమాలు చేసే అవకాశం ఆయనకు వచ్చింది. ఆ క్రమంలో ఎన్టీ రామారావు నాలుగు చిత్రాల్లో నటించడం జరిగింది. 1991లో ఆయన స్వీయ దర్శకత్వంలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని రూపొందించడం జరిగింది. 1992 లో మళ్లీ ఎన్టీ రామారావు దర్శకత్వం వహిస్తూ.. వాణి విశ్వనాథ్ హీరోయిన్ గా సామ్రాట్ అశోక్ చిత్రాన్ని రూపొందించాడు. తరువాత1993 లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో ఎన్టీ.రామారావు, మోహన్ బాబు కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో ఎన్టీరామారావు, జయసుధ హీరోహీరోయిన్లుగా నటించిన శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రం1993 అక్టోబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఎన్టీ రామారావు నటించిన చివరి సినిమాగా చెప్పుకోవచ్చు.
అయితే సామ్రాట్ అశోక్ సినిమాలో నటించిన వాణి విశ్వనాథ్ ఎన్టీరామారావు తో జోడిగా నటించింది. ఈ క్రమంలో.. ఒంటరి జీవితం గడుపుతున్న ఎన్టీ రామారావు, వాణి విశ్వనాథ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. కానీ ఎన్టీ రామారావు జీవిత చరిత్రను రాస్తున్న లక్ష్మీపార్వతిని ఎన్టీ రామారావు 1993 సెప్టెంబర్ లో వివాహమాడారు. దీంతో ఆ రూమర్స్ కి తెర పడినట్లయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…