ఈ హీరోయిన్ కూతురు టాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమాలకు పని చేస్తుందో తెలుసా..??
నాటి అందాల తార కూతురు టాలీవుడ్ లో రైటర్ అన్న సంగతి మీకు తెలుసా?
చంద్రకళ… తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న ఒకప్పటితరం నటి. నటనతో పాటు సాంప్రదాయ నృత్యంలో నిష్ణాతురాలు. ఆమె అనేక తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, మళయాళం చిత్రాలలో అద్భుతమయిన నటనను ప్రదర్శిచింది. చంద్రకళ మాతృభాష కొంకిణి తెలుగు, కన్నడం హిందీ భాషలను కూడా ఆమె మాట్లాడగలిగేది . షోలా ఔర్‌సబ్నం అనే హిందీ చిత్రంలో చంద్రకళ పరిచయం జరిగింది. ఆ తర్వాత అక్కినేని,ఎన్‌టిఆర్ లాంటి గొప్ప హీరోలతో పాటు హరనాథ్, శోభన్‌బాబు, చంద్రమోహన్, కృష్ణ, ఎన్‌టిఆర్, ఎ.ఎన్.ఆర్‌ల సరసన కూడా అద్భుతంగా నటించింది. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చంద్రకళ 1999జూన్ 21వ తేదీ, చెన్నైలో క్యాన్సర్ వ్యాధితో తనువు చాలించింది. ఆమె చనిపోయేనాటికి ఆమె వయస్సు 48 ఏళ్ళు.
చలన చిత్రం రంగం నుండి ఈమె దూరమై చాలా కాలమైనా ఆమె కుమార్తె రేష్మ మాత్రం ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో చాలా పాపులర్. యం.బి.ఏ. చేసిన రేష్మ 2008 నుంచి ఒక ఈవెంట్ మానేజ్ మెంట్ కంపెనీ ని స్థాపించి “రోబో” నుంచి “ఏమాయ చేసావే” సినిమా వరకూ అనేకం సినిమాలకు ప్రచార బాధ్యాతలను రేష్మ నిర్వర్తించింది. కాని ఆమె ఆ మధ్య వచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన “ఎటో వెళ్లిపోయింది మనసు” సినిమాకు కధను తయారు చేసింది రేష్మ అన్న విషయం చాల కొద్దిమందికి తెలిసి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ నిజ జీవితానికి దగ్గరగా ఉండే కధలు తను రాస్తాను అని చెపుతున్న రేష్మ ప్రస్తుతం సమాజంలో అమ్మాయిల గురించి అబ్బాయి లు, అబ్బాయిల గురించి అమ్మాయిలు ఎలా అనుకుంటారో అనే అనేక విషయాలను నిశితంగా పరిశీలించి ఈ కధను తయారు చేశానని రేష్మ చెపుతోంది. త్వరలోనే మో యూత్ ఫుల్ లవ్ స్టొరీ తయారు చేసే పనిలో బిజీగా ఉందట రేష్మ. సో.. మొత్తానికి టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న చంద్రకళ పిల్లల్లో ఎవరూ సినీ రంగంలో నటనా రంగంలోకి అడుగుపెట్టకపోయినా ఆమె పేరును నిలబెట్టేందుకు రేష్మా రైటర్ గా అడుగుపెట్టడం ఎంతైనా ఆనందదాయకం. రేష్మ భవిష్యత్తులో టాలీవుడ్ లో మంచి రైటర్ గా ఎదగాలని ఆశిద్దాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…