Categories: FeaturedMovie News

ఈ ఐదుగురు టాప్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగారు కాని ఈ రోజు సన్యాసం పుచ్చుకున్నారు

జీవిత‌మంటే అంతే. క‌ష్టాలు, సుఖాలు, క‌న్నీళ్లు, ఆనందాలు.. ఎత్తు, ప‌ల్లాలు అన్నీ అందులో ఉంటాయి. అన్నింటినీ మనిషి అనుభ‌విస్తాడు. అవ‌సాన ద‌శ‌లో వైరాగ్యం బాట ప‌డ‌తాడు. చివ‌ర‌కు జీవిత అంకం ముగుస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది జీవిత చ‌ర‌మాంకంలో వైరాగ్యం బాట ప‌ట్టి ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే కొంద‌రు సెల‌బ్రిటీలు మాత్రం జీవితం ఇంకా చాలా మిగిలి ఉన్న‌ప్ప‌టికీ ఆధ్యాత్మిక బాట ప‌ట్టారు. కొంద‌రు అందులో విజ‌య‌వంతంగా ముందుకు సాగుతుంటే కొంద‌రు మాత్రం దానికి బ్రేకులు వేసి తిరిగి య‌థాత‌థ జీవితం కొన‌సాగిస్తున్నారు. అలా ఆధ్యాత్మిక బాట ప‌ట్టిన ప‌లువురు సెల‌బ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మ‌నీషా కొయిరాలా
తెలుగులోనే కాదు, అనేక భాష‌ల్లోనూ మ‌నీషా కొయిరాలా న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు అండాశ‌య క్యాన్స‌ర్ సోకింది. దీంతో సినీ రంగానికి దూర‌మైంది. అయితే చికిత్స తీసుకుని కోలుకున్నాక ఈమె ఆధ్యాత్మిక బాట ప‌ట్టింది. 2016లో ఉజ్జయినిలో సాధ్విగా మారింది. అయిన‌ప్ప‌టికీ ఈమె ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తుండ‌డం విశేషం.
2. సోఫియా హ‌యత్
బిగ్ బాస్ సీజ‌న్ 7లో పాల్గొని అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది సోఫియా హ‌య‌త్‌. ఈమె ఓ బ్రిటిష్ మోడ‌ల్‌. సింగ‌ర్‌, యాక్ట‌ర్‌గా కూడా రాణించింది. అయితే ఈమె గ‌తంలో స‌న్యాసినిగా మారి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. కానీ ఆ జీవితానికి స్వ‌స్తి చెబుతూ మ‌ళ్లీ ఈమె పెళ్లి చేసుకుని య‌థాత‌థ జీవితాన్ని గ‌డుపుతోంది.
3. మమ‌తా కుల‌క‌ర్ణి
ఈమె ఒక‌ప్పుడు మంచి న‌టిగా గుర్తింపు పొందింది. త‌రువాత స‌న్యాసినిగా మారింది. ఈ క్ర‌మంలో త‌న గురించి ఓ ఆటోబ‌యోగ్ర‌ఫీ పుస్త‌కాన్ని రాసుకుంది. Autobiography Of An Yogini పేరిట ఆ బుక్‌ను విడుద‌ల చేసింది. అయితే ఈమె, ఈమె భ‌ర్త ఇద్దరూ. రూ.2వేల కోట్ల డ్ర‌గ్ స్కాంలో ఇరుక్కున్నారు. ఈ ఏడాది జూన్ 2017లో థానే కోర్టు వీరిని దోషులుగా ప్ర‌క‌టించింది.
4. బ‌ర్కా మ‌ద‌న్
ఈమె కూడా ప‌లు సినిమాల్లో న‌టించి న‌టిగా గుర్తింపు పొందింది. అయితే బౌద్ధ గురువు ద‌లైలామా ప్ర‌వ‌చ‌నాల ప‌ట్ల ఈమె ఆక‌ర్షితురాలైంది. దీంతో ఆమె 2012లో బుద్ధిజం తీసుకుంది. స‌న్యాసినిగా మారింది. Ven Gyalten Samten అనే పేరు పెట్టుకుంది. అప్ప‌టి నుంచి బ‌ర్కా మ‌ద‌న్ స‌న్యాసి జీవితాన్ని గ‌డుపుతోంది.
5. సుచిత్రా సేన్
ఈమె 25 ఏళ్ల పాటు న‌టిగా రాణించింది. అయితే ఇంట్లో నెల‌కొన్న అశాంతి కార‌ణంగా ఈమె దృష్టి ఆధ్యాత్మిక‌త వైపు మ‌ళ్లింది. రామ‌కృష్ణ మఠంలో చేరింది. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. స్వామి వివేకానంద అడుగుజాడ‌ల్లో న‌డిచింది. 2014 జ‌న‌వ‌రి 17న ఈమె త‌న 84వ ఏట మ‌రణించింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago