Categories: FeaturedGeneral News

త్వరపడండి.. ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: రూ.5కే 4GB డేటా..

టెలికాం రంగంలో రోజు రోజుకీ పోటీ పెరుగుతోంది. జియో పోటీని త‌ట్టుకునేందుకు ఆక‌ర్షణీయ‌మైన ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు గాలం వేస్తున్నాయి. దీంతో పోటీలు పడి మరీ ఆఫర్ల వర్షం గుప్పిస్తున్నాయి కొన్ని టెలికాం సంస్థలు. ఎయిర్‌టెల్ సంస్థ ఇందులో ముందంజలో ఉంది. తాజాగా ఈ సంస్థ రెండు రకాల ఆఫర్లను ప్రటించింది. ఒకటి రూ.349 ప్లాన్ కాగా… మరొకటి రూ.5 ప్లాన్. ఈ రెండు ఆఫర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రీచార్జ్‌ల‌పై క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రకటించింది.

రూ.5తో ఆఫర్ ప్రకటించింది. ఇది కేవలం 4జీ సిమ్‌కు మైగ్రేట్ అయ్యేవాళ్ల కోసం. ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌లోనే ఉన్న క‌స్ట‌మ‌ర్లు త‌మ సిమ్‌ను 4జీకి మార్చుకుంటే వాళ్ల‌కు కేవ‌లం రూ.5 రీచార్జ్‌తో 4 ఘ్భ్ డేటా ఇవ్వ‌నుంది. అయితే ఇది ఒక్క‌సారి మాత్ర‌మే రీచార్జ్ చేసుకోవ‌చ్చు. దీని వ్యాలిడిటీ 7 రోజులు. కేవ‌లం డేటా మాత్ర‌మే వాడుకోవచ్చు. ఫోన్ కాల్స్ ఉండవు.

రూ.349 ప్రీపెయిడ్ ప్యాక్‌లో 28 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, శ్ట్డ్ కాల్స్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఇది 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అయితే.. అన్‌లిమిటెడ్ కాల్స్‌ పేరుతో పరిమితి విధించారు. వారానికి 1000 నిమిషాలు దాటితే.. ఆ త‌ర్వాత నుంచి ప్ర‌తి కాల్‌కు ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌కైతే నిమిషానికి 10 పైస‌లు, ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 30 పైస‌లు వ‌సూలు చేయ‌నుంది. ఇక రోజు వారీ ప‌రిమితి 250 నిమిషాలుగా నిర్ణయించింది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రీచార్జ్ చేసుకునేవాళ్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో ట్రాన్స‌క్ష‌న్‌కు గ‌రిష్టంగా రూ.25 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో నుంచి రూ.349 ప్యాక్ వేసుకుంటే 10 శాతం అంటే రూ.34.9 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు.

telugudesk

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

11 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

11 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

11 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

12 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

14 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

15 hours ago