తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన మే 20, 1983న నందమూరి హరికృష్ణ, షామిలి దంపతులకు జన్మించారు. ఇక తారక్ తన చైల్డ్ హుడ్ లోనే కూచిపూడి నాట్యం లో ప్రావీణ్యం సాధించి పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇక హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న విద్యారణ్య ఉన్నత పాఠశాలలో పాఠశాలలో చదుకున్నారు. ఆ తరువాత ఆయన ఇండస్ట్రీకి అడుగుపెట్టారు.
సీనియర్ ఎన్టీఆర్ తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటుడిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైయ్యాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అది సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఎన్టీఆర్ టెంపర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ అరవింద సమేత వంటి సినిమాలతో వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతూ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్నారు. కానీ తారక్ చిన్న తనం నుండి కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో చాలా లావుగా ఉండే వాడు. అయితే యమదొంగ సినిమా సమయంలో లైపో చేయించుకుని దాదాపుగా 30 కేజీల బరువు తగ్గారు.
ఆయన కంత్రి సినిమాలో చాలా సన్నగా కనిపిస్తారు. ఇక అప్పటి నుండి పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఎన్టీఆర్ కి అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టమంటా. ఇక షూటింగ్ లేని సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇంట్లో వంట చేస్తూ ఉంటాడు. అంతేకాదు.. ఎన్టీఆర్ రొయ్యల బిర్యానీతో పాటు నాటుకోడి కూర, వేపుడులను ఎంతో ఇష్టంగా తింటారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…