Categories: FeaturedMovie News

శుభవార్త చెప్పబోతున్న మోనిత…కార్తీక్ భుజంపై చేయి వేసి ఓదార్చిన వంటలక్క..?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిన ఆనందరావు కార్తీక్ ను చెడామడా తిట్టేశాడు. నేడు ఎపిసోడ్ లో భాగంగా ఆనందరావు ఈ దారుణం చూడటానికేనా నా కోడలను బతికించావు అంటూ కార్తీక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి రోజే నువ్వు మోనితని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నీ దవడ పగలగొట్టిన ఉండి ఉంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదు. నువ్వు నింద వేసిన ఏళ్ల తరబడి భరించింది… నీలో మార్పు ఆశించింది.. అంతే కానీ నీకు విడాకులు ఇచ్చి వెళ్లి పోవాలని అనుకోలేదు అంటూ ఆనందరావు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మోనిత గురించి ముందే హెచ్చరించాం.. కానీ స్నేహం అనే ముసుగులో మమ్మల్ని మోసం చేసి చివరికి పెళ్లి వరకు తీసుకు వచ్చావ్.మోనితను పెళ్లికి ఏ విధంగా ఓపించావు కొన్ని గంటల భర్తగా ఉంటాననా? లేక నీ బిడ్డలకు కొన్ని గంటలు తండ్రిగా ఉంటాననా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.దీపని పెళ్లి చేసుకుని తనను మోసం చేసినందుకు తను నిన్ను ఎన్ని ప్రశ్నించాలి.. ఎన్ని రకాలుగా నిలదీయాలి.దీపకు చేసిన అన్యాయానికి నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిదేనంటూ కార్తీక్ ను కడిగి పడేసాడు.

ఈ విధంగా తండ్రి తిట్టడంతో కార్తీక్ ఆవేశంతో చేసిన పని కాదు, అలాగే నా బలహీనత వల్ల దిగజారి చేసిన తప్పు కాదు ఇది.. అయినా నాకు శిక్ష పడింది. ఏ రోజు ఎలాంటి పరిస్థితులలో కూడా ఒక్క మాట అనలేదు. కానీ మోనిత వల్ల నా పై మచ్చ పడింది అంటూ కార్తీక్ బాధపడతాడు. కేవలం మోనితను పెళ్లి చేసుకుంటానంటేనే ఇలా అసహ్యించుకుంటున్నారు అలాంటిది తను గర్భవతి అని తెలిస్తే ఆయన ఏమైపోతారో అంటూ కంగారు పడుతుండగా.. దీప కార్తీక్ భుజంపై చేయి వేసి నీ తప్పు లేదని నీ అంతరాత్మకు తెలిసినప్పుడు ప్రపంచం మొత్తం ఏమనుకున్నా పర్వాలేదు అంటూ కార్తీక్ ను ఓదారుస్తుంది.

ఇక దీప ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మోనిత ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ.. అంజి వ్యవహారం మీరే చూసుకోండి అని చెప్పగా అవతల నుంచి మీరేం కంగారు పడకండి అంటూ సమాధానం చెబుతారు. అయితే మీ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తానని మోనిత చెబుతుంది. ఈ విధంగా ఆ వ్యక్తి ఇచ్చిన భరోసాతో ఎంతో సంతోషంలో మునిగిపోయిన మోనిత తనను అనుమానంతో చూస్తున్న ప్రియమణితో త్వరలోనే నీకు శుభవార్త చెబుతా.. అంటూ ఆనందంలో తేలుతుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం మరొక ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago